Ad Code

వాట్సాప్ ద్వారా హైదరాబాద్ మెట్రో టికెట్స్ !


దేశంలో వాట్సాప్‌ ద్వారా ఫుల్లీ డిజిటల్ పేమెంట్ ఎనేబుల్డ్ ఈ టికెటింగ్ ఫెసిలిటీ తెచ్చిన తొలి మెట్రోగా హైదరాబాద్ మెట్రో రైల్ నిలిచింది. ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌ బిల్ఈజీ తో ఇందుకోసం హైదరాబాద్ మెట్రో భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. దీంతో ప్రయాణికులు ఇప్పుడు వాట్సాప్‌ ద్వారానే హైదరాబాద్ మెట్రో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. దీని కోసం స్మార్ట్ ఫోన్‌ లో వాట్సాప్‌ యాప్‌ ఓపెన్ చేసి హైదరాబాద్ మెట్రో రైల్ నంబర్ +91 8341146468 కు హాయ్ అని మెసేజ్ చేయాలి. ఆ నెంబర్ కు  మెసేజ్ చేయడానికి ముందుగా ఆ నెంబర్ ను సేవ్ చేసుకోవాలి. లేదంటే మైట్రో స్టేషన్‌లలో ఏర్పాటు చేసిన QR కోడ్‌ను స్కాన్ చేసినా కూడా సరిపోతుంది. ఆ నంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేసిన తర్వాత ఈ టికెటింగ్ కోసం ఒక యూఆర్‌ఎల్‌ వాట్సాప్ చాట్‌ లోకి  వస్తుంది. ఆ యూఆర్‌ఎల్‌ పై క్లిక్ చేస్తే ఈ-టికెట్ గేట్‌ వే వెబ్‌ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో జర్నీ రూట్‌ ను ఆ వెబ్‌పేజ్‌లో ఎంటర్ చేయాలి. అనంతరం ప్రొసీడ్‌పై క్లిక్ చేస్తే పేమెంట్ పేజీకి వెళుతుంది. ఇక్కడ పేమెంట్ పూర్తయ్యాక ఈ-టికెట్ యూఆర్ఎల్ వాట్సాప్‌ చాట్‌కే వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే QRకోడ్‌ ఈ-టికెట్ డౌన్‌లోడ్ అవుతుంది. ఇక మెట్రో గేట్ వద్ద ఈ QR కోడ్ స్కాన్ చేసి ఎంటర్ అవొచ్చు.

Post a Comment

0 Comments

Close Menu