Ad Code

డెల్ టాబ్లెట్ కం లాప్‌టాప్‌ విడుదల !


మార్కెట్‌లోకి నూతన `ఎక్స్‌పీఎస్ 13 టూ ఇన్ వన్‌` టాబ్లెట్ కం లాప్‌టాప్‌ను తీసుకొచ్చింది. ఇది రెండు వేరియంట్లలో లభ్యం అవుతుంది. దీని ధర రూ.1,39,990 నుంచి మొదలవుతుంది. డెల్ ఎక్స్‌పీఎస్ 13 టూ ఇన్ వన్ టాబ్లెట్ కం లాప్‌టాప్ ఐ-5, ఐ-7 వేరియంట్లలో 16జీబీ రామ్‌తో అందుబాటులో ఉంటుంది. ఇంటర్నల్ మెమొరీని బట్టి ధర ఖరారు చేస్తారు. టాబ్లెట్‌లో సిమ్ కార్డ్ కూడా వాడొచ్చు. 12 (టువెల్త్‌) జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌తో కూడిన టాబ్లెట్‌, కీబోర్డ్ కేస్‌, స్టైలస్‌తో వస్తుంది. యూజర్లు ఆల్ట్రా థిన్ డిటాచబుల్ డిజైన్‌లో ఈ లాప్‌టాప్‌ను టాబ్లెట్‌గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ లాప్‌టాప్ 13 అంగుళాల 3:2 3కే డిస్‌ప్లేతో వస్తోంది. దీనికి 4 యూఎస్బీ టైప్‌-సీ పోర్ట్‌లు ఉంటాయి. యూఎస్బీ టైప్-సీ నుంచి టైప్-ఏ వీ3.0 అడాప్టర్ కూడా వస్తుంది. యూఎస్‌బీ టైప్‌-సీ నుంచి 3.5 ఎంఎం హెడ్‌సెట్ అడాప్టర్ కూడా జత చేస్తారు. చార్జింగ్ కోసం 45 వాట్ల టైప్‌-సీ అడాప్టర్ ఉంటుంది. 11 మెగా పిక్సెల్ (ఎంపీ) రేర్‌, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. ఈ లాప్‌టాప్‌కు 11 ఎంపీ రేర్ కెమెరా, 5 ఎంపీ వెబ్‌కామ్ ఉంటుంది. ఐ-7 వేరియంట్ ధర రూ.1,77,990 పలుకుతుంది. ఐ-7 ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యం ఒక టిగా బైట్స్ ఉంటుంది. ఐ-5 వేరియంట్‌లో 512 జీబీ ఇంటర్నరల్ మెమొరీ ఉంటుంది. డెల్ అధికారిక వెబ్‌సైట్ లేదా డెల్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లలో మాత్రమే ఎక్స్‌పీఎస్ 13 టూ ఇన్ వన్ టాబ్లెట్ కం లాప్‌టాప్ లభిస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu