Ad Code

కార్ల అమ్మకాలలో ఆల్ టైమ్ రికార్డ్ !


సెమీ కండక్టర్ల కొరత ఉన్నా కూడా భారత్ లో కార్ల అమ్మకాలు రికార్ట్ స్థాయికి చేరుకున్నాయి. కరోనా కంటే ముందున్న రికార్డులను కూడా సెప్టెంబర్ మాసం బద్దలు కొట్టింది. భారత్ లో కార్ల అమ్మకాల్లో 2022 సెప్టెంబర్ అరుదైన ఘనత సాధించింది. కరోనా తర్వాత రెండేళ్లుగా వాహనాలకు డిమాండ్ పెరుగుతున్నా, దానికి తగ్గ సప్లయ్ లేకపోవడంతో అమ్మకాలు క్షీణించాయి. ఇప్పటికి పరిస్థితి కుదుట పడింది. సెప్టెంబర్ నెలలో 3,55,946 కార్లు దేశవ్యాప్తంగా అమ్ముడయ్యాయి. ఆగస్ట్ లో అమ్ముడయిన 2,81,210 కార్ల కంటే ఇది 26 శాతం అధికం. మధ్యతరగతి దృష్టి టూవీలర్ల వైపునుంచి కార్ల వైపు మళ్లడంతో ఈ ఘనత సాధ్యమైంది. ఈఎంఐలు వీరికి వరంగా మారాయి. భారత్ లో అన్ని ప్రముఖ కార్ల కంపెనీలకు ఇబ్బడిముబ్బడిగా బుకింగ్స్ వస్తున్నాయి. సెమీకండక్టర్ల కొరత కార్ల ఉత్పత్తిపై ప్రభావాన్ని చూపిస్తోంది. దీని కారణంగా కొన్ని కార్లపై వెయిటింగ్ పీరియడ్ ఐదారు నెలల కంటే ఎక్కువగా ఉంటోంది. కండక్టర్ల కొరత ఉన్నా కూడా భారత్ లో కార్ల అమ్మకాలు రికార్డ్ స్థాయికి చేరడం విశేషం.

Post a Comment

0 Comments

Close Menu