Ad Code

స్పామ్ కాల్స్ ఇబ్బంది పెడుతున్నాయా?


ఈ ఏడాది అమెరికాలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు సుమారు 52 బిలియన్లకు పైగా రోబోకాల్స్ అందుకున్నట్లు యూమెయిల్ అనే సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. ప్రతి వారం సుమారు 1 బిలియన్ కాల్స్ వస్తున్నట్లు గుర్తించింది. వాస్తవానికి మనకు వచ్చే కాల్స్ లో ఎక్కువగా రోబో కాల్స్ ఉంటాయి. ఈ కాల్స్ ముందుగా రికార్డు చేయబడి ఉంటాయి. ఫోన్ లిఫ్ట్ చేయగానే ఆటోమేటిక్ గా రికార్డు అయిన వాయిస్ ను వినిపిస్తుంది. టెలి మార్కెటింగ్ కాల్స్ కూడా చాలా వస్తుంటాయి. ప్రజలకు తమ ప్రొడక్ట్స్ గురించి వివరించి మార్కెట్ చేసుకునేందుకు పలు కంపెనీలు ఈ కాల్స్ చేస్తుంటాయి. అటు మోసపూరిత ఉద్దేశంతో కూడిన స్పామ్ కాల్స్.. యూజర్లకు సంబంధించిన బ్యాంక్ డేటా సహా అత్యంత ముఖ్యమైన వివరాలను దొంగిలించే ప్రయత్నం చేస్తాయి. ఇలాంటి అవాంఛిత కాల్స్ నుంచి రక్షణ పొందేందుకు గూగుల్ రెండు ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్లు కాలర్ ID, స్పామ్ ప్రొటెక్షన్ లతో డిఫాల్ట్‌ గా ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఆన్ అవుతాయి. ఒక వేళ ఆన్ చేయకపోతే వినియోగదారులు స్పామ్ కాల్స్ రాకుండా ఉండేలా ఈ సెట్టింగ్స్ మార్చుకుంటే సరిపోతుంది. స్మార్ట్‌ ఫోన్‌లో ఫోన్ యాప్‌ని ఓపెన్ చేసి  'మోర్' అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాతసెట్టింగ్‌ల బటన్‌ ను ఎంచుకోవాలి. 'స్పామ్, కాల్ స్క్రీన్'ను సెలెక్ట్ చేసుకోవాలి. కాలర్ & స్పామ్ ID ఆఫ్ చేసి ఉంటే ఆన్ చేసుకోవాలి.

Post a Comment

0 Comments

Close Menu