Ad Code

మోస్ట్ లగ్జరియస్ ఎంపీవీ కారు జీక్ర్ 009 విడుదల


చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కంపెనీ జీక్ర్ తాజాగా మోస్ట్ లగ్జరియస్ ఎంపీవీ కారును విడుదల చేసింది. కంపెనీ నుంచి వస్తున్న రెండో లేటెస్ట్ లగ్జరీ ఎలక్ట్రిక్ వెహికల్ ఇది. దీని పేరు జీక్ర్ 009. ఈ లార్జ్ లగ్జరీ ఎంపీవీ 009 మినీ వ్యాన్ పొడవు 5209 ఎంఎంగా, విడ్త్ 2024 ఎంఎంగా ఉంది. వీల్ బేస్ 3205 ఎంఎం. ఈ కారులో రెండు, మూడో వరుసలో 2+ 2 కెప్టెన్ సీట్లు ఉంటాయి. ఈ కారులో ఆరుగురు ప్రయాణం చేయొచ్చు. ఈ కారు బరువు 2830 కేజీలు. అయినా కూడా 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 4.5 సెకన్లలోనే అందుకుంటుంది. ఈ కారులో డ్యూయెల్ మోటార్ ఉంటుంది. దీని టార్క్ 686 ఎన్ఎం. పవర్ 536 బీహెచ్‌పీ. ఈ కారులో రెండు బ్యాటరీలు ఉంటాయి. ఈ కారు రేంజ్ 702 కిలోమీటర్లు. 116 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉన్న కారుకు ఇది వర్తిస్తుంది. అదే 140 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉన్న కారు అయితే రేంజ్ 822 కిలోమీటర్లు. కారు లోపలి భాగంలో 10.4 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఉంటుంది. అంతేకాకుండా 15.6 అంగుళాల టచ్ స్క్రీన్ కూడా ఉంటుంది. దీని ద్వారా కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడొచ్చు. దీని ధర 68,340 డాలర్లు. ఇంకా ఏఐ ఇంటెలిజెంట్ అసిస్టెంట్ ఉంటుంది. 20 వట్ యమహా ఆడియో సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఈ కారులో ఏడు 8 ఎంపీ హెచ్‌డీ కెమెరాలు, నాలుగు 2 ఎంపీ 360 డిగ్రీ కెమెరాలు ఉంటాయి.  

Post a Comment

0 Comments

Close Menu