Ad Code

ఐఫోన్ 15 ప్రొ మ్యాక్స్‌


వచ్చే ఏడాది రానున్న ఐఫోన్ 15 సిరీస్‌పై అంచనాలు ఊపందుకున్నాయి. నెక్ట్స్ జనరేషన్ ఐఫోన్ల ఫీచర్లు ఇవేనంటూ పలు లీక్‌లు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఐఫోన్లలో తొలిసారిగా ఐఫోన్ 15 ప్రొ మ్యాక్స్ పెరిమాక్స్ జూమ్ లెన్స్‌తో కస్టమర్ల ముందుకు రానుందని టెక్ నిపుణులు మింగ్ చి కూ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఇది రెగ్యులర్ ప్రొ మోడల్‌లో అందుబాటులో ఉండదని చెబుతున్నారు. పెరిస్కోప్ లెన్స్‌తో యూజర్లు బ్యాక్‌గ్రౌండ్ బ్లర్‌తో మెరుగైన ఫోటోలను క్యాప్చర్ చేసే వెసులుబాటు కలుగుతుంది. ఫొటోగ్రాఫర్‌, సబ్జెక్ట్ మధ్య దూరాన్ని పెరిస్కోప్ జూమ్ కెమెరాలు తగ్గించడంతో దూరం నుంచి కూడా మెరుగైన ఫోటోలను క్లిక్ చేయవచ్చు. గతంలో ఒప్పో తొలిసారిగా స్మార్ట్‌ఫోన్లలో పెరిస్కోప్ లెన్స్‌ను ప్రవేశపెట్టింది. పెరిస్కోప్ లెన్స్‌తో ప్రైమరీ కెమెరా కంటే ఐదు రెట్లు అధికంగా నాణ్యతతో కూడిన ఫోటోలు తీసుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎస్‌22 అల్ట్రా కూడా 10x ఆప్టికల్ జూమ్ నుంచి 100x డిజిటల్ జూమ్ వరకూ సపోర్ట్ చేసే పెరిస్కోప్ లెన్స్‌ను కలిగిఉంది. ఇక ఐఫోన్ 13 ప్రొ మోడల్స్ టెలిఫొటో లెన్స్‌తో కస్టమర్ల ముందుకొచ్చాయి.

Post a Comment

0 Comments

Close Menu