Ad Code

16న మైక్రో ఎలక్ట్రిక్ కారు విడుదల !


అతి చిన్న ఎలక్ట్రిక్ కారు త్వరలో అందుబాటులోకి రానుంది. గతంలో వచ్చిన నానో కారు కంటే చిన్న కారు ఇండియాలో రోడ్డెక్కనుంది. ముంబైకి చెందిన పీఎంవీ ఎలక్ట్రిక్ ఈ నెల 16న మైక్రో ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఈఏఎస్​-ఈ వాహనం లాంచ్ ధర రూ. 4లక్షలు- 5లక్షల మధ్యలో ఉండే అవకాశం ఉంది. పీఎంవీ ఎలక్ట్రిక్ నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ కారు ఇది. ప్రతి రోజూ అసరాలకి ఉపయోగించే విధంగా దీన్ని తయారు చేస్తున్నారు. ఇప్పటికే కారు ప్రొటో టైప్ సిద్ధమైందని, త్వరలోనే ఉత్పత్తి మొదలు పెట్టాల్సి ఉందని పీఎంవీ ఎలక్ట్రిక్ తెలిపింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తాము ఈ కారును అభివృద్ధి చేశామని పీఎంవీ ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు కల్పిత్ పటేల్ తెలిపారు. పర్సనల్ మొబిలిటీ పేరిట ఓ కొత్త విభాగాన్ని పరిచయం చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈజ్-ఈ కారు ఒక్కసారి చార్జ్ చేస్తే 120-200 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవచ్చు. నాలుగు గంటల్లో బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. పీఎంవీ ఎలక్ట్రిక్​ ఈఏఎస్​-ఈలో డిజిటల్​ ఇన్​ఫోటైన్​మెంట్​ సిస్టమ్​, యూఎస్​బీ ఛార్జింగ్​ పోర్ట్​, ఏసీ, రిమోట్​ కీలెస్​ ఎంట్రీ, రిమోట్​ పార్క్​ అసిస్ట్​, క్రూజ్​ కంట్రోల్​, సీట్​ బెల్ట్స్​ వంటివి రానున్నాయి. మైక్రో ఎలక్ట్రిక్​ కారు పొడవు 2,915ఎంఎం, విడ్త్​ 1,157ఎంఎం, హైట్​ 1,600ఎంఎంగా ఉంటుంది. దీని వీల్​బేస్​ 2,087ఎంఎంగా, గ్రౌండ్​ క్లియరెన్స్​ 170ఎంఎంగా ఉండవచ్చు. ఈ ఈవీ వెహికల్​ బరువు 550కేజీలు అని సంస్థ చెప్పింది.

Post a Comment

0 Comments

Close Menu