Ad Code

2023లోనూ యాపిల్ నియామకాల నిలిపివేత ?


యాపిల్ సంస్థ వచ్చే ఏడాది కూడా హైరింగ్ నిలిపివేయాలని యోచిస్తోంది. ప్రతికూల ఆర్ధిక పరిస్ధితులపై ఆందోళనతో కంపెనీ నియామక ప్రక్రియను నిలిపివేసిందని ఓ వాణిజ్య పత్రిక కధనం వెల్లడించింది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ ఏడాది హైరింగ్‌ను నిలిపివేసిన యాపిల్ 2023లోనూ హైరింగ్ ప్రణాళికలను నిలిపివేయాలని భావిస్తోంది. రాబోయే కొద్ది నెలల్లో కొత్తగా ఎవరినీ విధుల్లోకి తీసుకోవడం లేదని కంపెనీ ఇప్పటికే పలు విభాగాధిపతులకు స్పష్టం చేసినట్టు సమాచారం. సెప్టెంబర్ 2023తో ముగిసే ఆర్ధిక సంవత్సరం వరకూ హైరింగ్ నిలిపివేతను పొడిగించాలని కంపెనీ నిర్ణయించినట్టు తెలిసింది. రాబోయే ఏడాదిలో అదనంగా తీసుకునే సిబ్బందికి అవసరమైన బడ్జెట్ లేకపోవడంతోనే నియామకాల ప్రక్రియను యాపిల్ నిలిపివేసిందని చెబుతున్నారు. ఆర్ధిక పరిస్ధితులకు అనుగుణంగా వాణిజ్య విభాగాల్లో హైరింగ్‌పై ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని యాపిల్ ప్రతినిధి పేర్కొన్నారు. దీర్ఘకాలంలో యాపిల్ భవిష్యత్ పట్ల తాము ఆశాభావంతో ఉన్నామని ఆ దిశగా వినూత్న ధోరణిలో తెలివైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళతామని చెప్పుకొచ్చారు.

Post a Comment

0 Comments

Close Menu