Ad Code

26న పీఎస్ఎల్వీ - సీ 54 ప్రయోగం


ఈనెల 26 న తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ - సీ 54 రాకెట్ ప్రయోగానికి శాస్త్ర వేత్తలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రయోగం పై మిషన్ సన్నద్ధత సమావేశం జరిగింది. శుక్రవారం ఉదయం 10 గంటల 26 నిముషాలకు కౌంట్ డౌన్ ప్రారంభం అవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. 25 గంటల 30 నిముషాల అనంతరం 26 వ తేదీ ఉదయం 11 గంటల 56 నిముషాలకు శ్రీహరికోట లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి రాకెట్ ప్రయోగం జరగనుంది. ఈ రాకెట్ ప్రయోగం ద్వారా EOS-06 అనే ప్రధాన ఉపగ్రహం తోపాటు విదేశాలకు చెందిన మరో 8 చిన్న తరహా ఉపగ్రహాలను నింగిలోనికి పంపనుంది ఇస్రో. భారత్, భూటాన్ సంయుక్తంగా డెవలప్​ చేసిన ఎనిమిది నానోశాటిలైట్​లను ఇస్రో నింగిలోకి పంపనుంది. పీఎస్​ఎల్​వీ లాంచ్ వెహికల్ ద్వారా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఈ ఏడాది అయిదో ప్రయోగాన్ని చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉపగ్రహాన్ని సన్ సింక్రోనస్ ఆర్బిట్‌లోకి ప్రయోగించనున్నారు. 2019లో ప్రధాని నరేంద్ర మోదీ థింపూ పర్యటన తర్వాత అంతరిక్ష ప్రయోగం సంయుక్తంగా చేపడుతుందని ప్రకటించారు.

Post a Comment

0 Comments

Close Menu