Ad Code

కాయిన్‌బేస్‌ నుంచి 60 మంది ఉద్యోగుల తొలగింపు !


ట్విట్టర్‌, మెటా మాస్ లేఆఫ్స్‌తో ఉద్యోగులను వణికించగా తాజాగా క్రిప్టో ఎక్స్ఛేంజ్ కాయిన్‌బేస్ 60 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. మూడో క్వార్టర్‌లో సంస్ధను నికర నష్టాలు వెంటాడటంతో వ్యయ నియంత్రణ కోసం కాయిన్‌బేస్ ఉద్యోగులపై వేటు వేసింది. కాయిన్‌బేస్ ఈ ఏడాది జాబ్ కట్స్‌కు పాల్పడటం ఇదే తొలిసారి కాదు. జూన్‌లో తమ ఉద్యోగుల్లో 18 శాతంగా ఉన్న 1100 మంది ఉద్యోగులను కంపెనీ తొలగించింది. రెండో విడత లేఆఫ్స్‌లో తన రిక్రూటింగ్, ఇనిస్టిట్యూషనల్ ఆన్‌బోర్డింగ్ టీమ్స్ నుంచి 60 మంది ఉద్యోగులను తొలగించినట్టు కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. రెండో దశలో కాయిన్‌బేస్ మరికొంతమంది ఉద్యోగులను తొలగించవచ్చని వార్తలు వస్తున్నాయి. ట్విట్టర్ ఇటీవల 3000కు మందికి పైగా ఉద్యోగులను సాగనంపడం, సోషల్‌మీడియా దిగ్గజం మెటా ఏకంగా 11,000 మందిని తొలగించిన క్రమంలో కాయిన్‌బేస్ తాజా లేఆఫ్స్‌ను ప్రకటించడం గమనార్హం. ఇక ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడుతుండటం, మందగమనం నేపధ్యంలో టెక్ కంపెనీలు లేఆఫ్స్‌కు దిగుతున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu