Ad Code

బెస్ట్ కెరీర్‌ ఆప్షన్‌ గేమింగ్‌ !


గేమింగ్‌ అనేది హాబీగానే కాదు కెరీర్‌గానూమార్చుకునేందుకు సిద్దమంటున్నారు నేటి మహిళా గేమర్లు. ఈ విషయంపై జరిగిన ఓ అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. గురువారం విడుదలైన 'HP ఇండియా గేమింగ్ ల్యాండ్‌స్కేప్ స్టడీ 2022' రెండవ ఎడిషన్ సర్వే వివరాల ప్రకారం.. గేమింగ్‌ని ఫుల్‌టైమ్‌, పార్ట్‌టైమ్‌ కెరీర్‌ ఆప్షన్లుగా తీసుకునే వారి సంఖ్య పెరిగింది. భారత్‌లో మహిళా గేమర్లను ఈ విషయంపై అడిగితే 56శాతం మంది దీన్ని తమ ప్రధాన కెరీర్‌ ఆప్షన్‌గా చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తమ అభిరుచిని కెరీర్‌ ఆప్షన్‌గా ఎంచుకుని మహిళా గేమర్లు సంతోషంగా సంపాదన కూడా పొందుతున్నారు. 50శాతం మంది మహిళా గేమర్లు దీన్ని సీరియస్‌గా వృత్తిగా తీసుకున్నామని, 45శాతం మంది ఇందులో డబ్బులు కూడా సంపాదిస్తున్నామని చెప్పారు. గేమింగ్ అనేది వినోదం ఇంకా విశ్రాంతి అని 92 శాతం మంది ఒప్పుకొన్నారు. దీని వల్ల మానసికంగా చురుకుగా ఉంటామని 58 శాతం మంది, సోషియలైజింగ్‌గా ఉంటామని 52 శాతం మంది తెలిపారు. గేమర్‌గా మారడం వీరి మొదటి ప్రాధాన్యతే. దానితోపాటు ఇన్‌ఫ్లుయెన్సర్, గేమింగ్ సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా మారడం వంటి ఆప్షన్లు కూడా వీరిలో ఆసక్తిని కలిగిస్తున్నాయి. అధిక శాతం మంది గేమర్లు గేమింగ్‌కి పీసీలే బెటర్ డివైజ్‌ అని చెబుతున్నారు. మెరుగైన ప్రాసెసర్‌లు, డిజైన్, గ్రాఫిక్‌లు, డిస్‌ప్లేలతో ఇప్పుడు పీసీలు అందుబాటులో ఉన్నాయి. అందుకే దీనిలో గేమింగ్‌ తమకు సౌకర్యంగా ఉంటుదని మొదటి ఓటు దీనికే వేస్తున్నారు. 68 శాతం మంది గేమర్‌లు PCలకు ఓటు వేయడంతో అవి అత్యంత ప్రాధాన్య పరికరంగా ఉన్నట్లు అధ్యయనం తెలిపింది. పీసీ గేమింగ్‌లో ఉన్న ప్రయోజనాలను దృష్టిలో పెట్టకుని 39శాతం మంది మొబైల్‌ గేమర్లు పీసీ గేమర్‌లుగా మారడానికి ప్రయత్నిస్తున్నారు.PC గేమింగ్ ల్యాండ్‌స్కేప్ యువతకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. వీరికి ప్రముఖ గేమింగ్‌ ల్యాప్‌టాప్‌ల తయారీ కంపెనీ హెచ్‌పీ కూడా మంచి సపోర్ట్‌ని అందిస్తోంది. గేమింగ్‌కి సంబంధించిన నాలెడ్జ్‌, టూల్స్‌, అవకాశాలు, నైపుణ్యాలకు పదును పెట్టుకోవడం లాంటి వాటిలో గేమర్లకు అండగా నిలుస్తోంది. కమ్యునిటీ ఇనిషియేటివ్‌ ప్రోగ్రాంల ద్వారా గేమర్లకు తాము సపోర్ట్‌ ఇస్తున్నట్లు హెచ్‌పీ ఇండియా మార్కెట్‌ సీనియర్‌ డైరెక్టర్‌ (పర్సనల్‌ సిస్టమ్స్‌) విక్రం బేడి తెలిపారు. PC గేమింగ్‌కు బలమైన డిమాండ్‌ ఉండటం తమకు భారీ వ్యాపార అవకాశాన్ని సూచిస్తోందని అన్నారు. భారతదేశంలో అధునాతన గేమింగ్ ఎకో సిస్టంను ప్రారంభించడానికి అవసరమైన ఇంజనీరింగ్‌ ప్లానింగ్‌ చేస్తామని బేడీ చెప్పారు. ఈ అధ్యయనం ప్రకారం చూస్తే ఈ రంగంలోకి వచ్చే వారిలో కేవలం 2 శాతం మంది మాత్రమే గేమింగ్‌లో అధికారిక శిక్షణ పొందారు. చాలా మంది గేమర్‌లు తమ గేమింగ్ పనితీరును అప్‌గ్రేడ్ చేసుకవడంపై ఆసక్తి చూపిస్తున్నారు. వారిలో 32 శాతం మంది తమ నైపుణ్యాలను పెంచుకోవడానికి గేమింగ్ స్టార్‌ను అనుసరిస్తారు.

Post a Comment

0 Comments

Close Menu