Ad Code

స్టీవ్‌ జాబ్స్‌ నేర్పిన పాఠాలు ఇప్పటికీ అనుసరణీయం !


స్టీవ్‌ జాబ్స్‌తో ఎంతో సన్నిహితంగా పని చేసిన టిమ్‌ కుక్‌.. ఆయన నేర్పిన పాఠాలు ఇప్పటికీ తనకు అనుసరణీయమని అంటున్నారు. మార్కెట్‌లో లీడింగ్‌ ఫోర్స్‌గా నిలవడంలో అవి తనకు ఎంతో ఉపయోగపడ్డాయని చెప్పారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కుక్‌ తన మనసులోని మాటల్ని పంచుకున్నారు. తన టీచర్లలో స్టీవ్‌ జాబ్స్‌ అత్యుత్తమ ఉపాధ్యాయుడని టిమ్ కుక్ గతంలోనూ ఓసారి చెప్పారు. 'ఆనందం ఎప్పుడూ ప్రయాణంలోనే ఉంటుంది. ఒకే దగ్గర ఆగిపోయినప్పుడు కాదు. ఎప్పటికప్పుడు తర్వాత దాని కోసం ఆలోచించడం మజా ఇస్తుంది. కొత్త దాని కోసం ఆలోచించడంలోనూ, దాని కోసం అవసరమైన పనులు చేయడంలోనూ ఆనందం వెతుక్కుంటూ ఉండాలి. అప్పుడే మన ప్రయాణం బాగుంటుంది. అప్పుడే కొత్త ఇన్నోవేషన్స్‌ పుట్టుకొస్తాయి' అని స్టీవ్ చెప్పేవారని టిమ్ కుక్ వివరించారు. యాపిల్ ఒక దశలో నష్టాలతో దివాలా తీసే సంస్థగా మారింది. ఆ తరుణంలో స్టీవ్‌ జాబ్స్‌ తిరిగి సంస్థలోకి వచ్చి దాన్ని రక్షించారు. అది ట్రిలియన్ డాలర్ల కంపెనీ కావడంలో ఆయన ఎంతో సాయపడ్డారు. ఇప్పుడు యాపిల్‌ సంస్థకు ఎన్నో టెక్నాలజికల్ ఇన్నొవేషన్‌ ఉన్న ఉత్పత్తులు ఉన్నాయి. స్టీవ్‌ జాబ్స్ నుంచి యాపిల్ సంస్థ టిమ్‌ కుక్‌ చేతుల్లోకి మారిన తర్వాత కూడా, కంపెనీ స్టీవ్‌ వేసిన బాటలో నడవడం మానుకోలేదు. ఎప్పుడూ కొత్త ఇన్నోవేషన్లతో ముందుకు సాగుతూ ఉంది. దీంతో ఆర్థికంగానూ ఈ సంస్థ బలమైన శక్తిగా మారింది. అత్యుత్తమ ప్రొడక్ట్స్ అందిస్తే రేటు ఎంత అనేది ఎప్పటికీ అడ్డంకి కాదని అందరికీ తెలిసేలా చెప్పింది. తమ ప్రొడక్ట్స్‌కు కచ్చితమైన వినియోగదారులను సంపాదించుకుని సత్తా చాటింది.

Post a Comment

0 Comments

Close Menu