Ad Code

అంగారక గ్రహం ఒకప్పుడు నీళ్లతో కళకళలాడేదా ?


ఎర్రటి ఎడారిగా కనిపించే అంగారక గ్రహంపై గతంలో నీరు ఉండేదని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, మార్స్ పై ఎంత నీరు ఉండేది. అది జీవరాశి మనుగడకు సరిపోయేంత ఉండిందా? అనే అనేక సందేహాలు శాస్త్రవేత్తల్లో ఉండేది. కోపెన్‌హగెన్‌ శాస్త్రవేత్తలు వెలువరించిన తాజా అధ్యయనం ఇలాంటి కొన్ని సందేహాలకు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఎర్రటి ఎడారిగా కనిపించే అంగారక గ్రహం ఒకప్పుడు నీళ్లతో నిండి నీలి రంగులో కనిపించేదని పేర్కొన్నది. 450 కోట్ల ఏండ్ల క్రితం అంగారకుడిపై 984 అడుగుల లోతున్న మహాసముద్రాలు ఉండేవని కోపెన్‌హగెన్‌ శాస్త్రవేత్తలు తమ అధ్యయనాల్లో తెలిపారు. వందల కోట్ల క్రితం మార్స్‌ను మంచుతో కూడిన గ్రహశకలాలు ఢీకొట్టాయని, అందువల్లనే నీరంతా అవిరై వాతావరణంలో కలిసిపోయిందని చెప్పుకొచ్చారు.

Post a Comment

0 Comments

Close Menu