Ad Code

ట్విట్టర్ 'బ్లూ' సర్వీస్‌ విడుదల వాయిదా !

ట్విట్టర్‌ కొత్త సీఈవో ఎలాన్‌ మస్క్, ఇటీవల ట్విట్టర్‌ బ్లూ టిక్‌ అకౌంట్‌ సేవలకు వినియోగదారులు నెలకు 8 డాలర్లు చెల్లించాలని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ఈ విధానాన్ని రీలాంచ్‌ చేసే నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు తాజాగా ట్వీట్‌ చేశారు. ప్రజలకు ఎలాంటి అవకతవకలు జరగవని, పూర్తి విశ్వాసం వచ్చాకే ట్విట్టర్‌ బ్లూ సేవలను తిరిగి లాంచ్‌ చేస్తామని ట్వీట్‌ చేశారు. వ్యక్తుల కంటే సంస్థల కోసం డిఫరెంట్‌ కలర్స్‌ చెక్‌లను ఉపయోగిస్తామని తెలిపారు. మస్క్ ట్విట్టర్ బ్లూను పరిచయం చేసిన తర్వాత వివిధ కంపెనీల పేరిట బోగస్ వెరిఫైడ్‌ అకౌంట్లు క్రియేట్‌ అయ్యాయి. ప్రసిద్ధ కంపెనీలు, వ్యక్తులను అనుకరించడానికి చాలా మంది ప్రయత్నించారు. అమెరికాలో ఓ ఫార్మా కంపెనీ పేరిట నకిలీ వెరిఫైడ్‌ అకౌంట్ ఓపెన్‌ చేసిన కొందరు నెగెటివ్‌ న్యూస్ ప్రకటించడంతో ఆ కంపెనీ వ్యాల్యూ స్టాక్‌ మార్కెట్‌లో భారీగా పతనమైంది. ఆ ఫేక్ అనౌన్స్‌మెంట్ చేసిన ట్విట్టర్‌ అకౌంట్‌ తమది కాదని సంబంధిత కంపెనీ ప్రకటించాల్సిన పరిస్థితి నెలకొంది. ట్విట్టర్‌ బ్లూ నిర్ణయం సరైంది కాదని టెక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. నగదు చెల్లించి అందరూ వెరిఫైడ్‌ అకౌంట్స్‌ పొందితే.. ఎవ్వరికీ వెరిఫైడ్‌ అకౌంట్స్‌ లేవని నిర్ధారించుకోవాలని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులు వెరిఫికేషన్‌ను పేమెంట్‌ ఫీచర్‌గా మార్చాలనే నిర్ణయాన్ని విమర్శించారు. ఎలాన్‌ మస్క్ వాస్తవానికి ఫ్రీ స్పీచ్‌,ట్విట్టర్‌ బాట్స్‌ సమస్యల గురించి పట్టించుకోవాలని ఆరోపణలు చేశారు. ఉద్యోగుల తొలగింపులు, స్వచ్ఛంద రాజీనామాలు, ట్విట్టర్‌ బ్లూ వివాదాల నడుమ.. గత వారంలో ట్విట్టర్ 1.6 మిలియన్ల రోజువారీ యాక్టివ్‌ యూజర్లను పెంచుకుందని, ఇది మరొక ఆల్-టైమ్ హై అని ఎలాన్‌ మస్క్‌ ప్రకటించడం గమనార్హం.

Post a Comment

0 Comments

Close Menu