Ad Code

హోండా అడ్వెంచర్ బైక్ !


హోండా సంస్థ స్టైలిష్ రెట్రో లుక్‍తో సీఎల్500 స్క్రాంబ్లర్ అడ్వెంచర్ బైక్‍ ను ప్రదర్శించింది. ఈ బైక్ ట్యుబులర్ స్టీల్ ట్రెలిస్ స్టైల్ మెయిన్ ఫ్రేమ్‍ను కలిగి ఉంది. లాంగ్ ట్రావెల్స్ కు బైక్ బాగా సరిపోతుంది అని చెప్పవచ్చు. 41mm టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక అడ్జస్టబుల్ షాక్స్, సస్పెన్షన్ పనిని చేస్తాయి. ఈ బైక్ ముందు వీల్ 19 ఇంచులు ఉంటుంది. అలాగే వెనుక వీల్ 17 ఇంచుల సైజ్ ఉంటుంది. హోండా సంస్థ తన లేటెస్ట్ క్రూజర్ సీఎల్500 స్క్రాంబ్లర్ ను హోండా EICMAలో ప్రదర్శించింది. ఈ బైక్ లుక్ అద్భుతంగా ఉండడంతో పాటు రెట్రో స్టైల్ తో అదిరిపోయే విధంగా ఉంది. 46 పీస్ పవర్, 43.4 Nm టార్క్యూను ప్రొడ్యూస్ చేసే 471సీసీ ప్యార్లెల్ ట్విన్ సిలిడర్ ఇండిన్‍ను ఈ అడ్వెంచర్ బైక్ కలిగి ఉంది. కాగా హోండా సంస్థ 1970ల కాలం నాటి సీఎల్ మోటార్‍ బైక్‍ల నుంచి ప్రేరణ పొంది సీఎం500 బైక్‍ను లుక్‍ను డిజైన్ చేసింది. దీంతో రెట్రో లుక్‍లో ఈ స్క్రాంబ్లర్ అద్భుతమైన లుక్ లో ఆకర్షణీయంగా ఉంది. హోండా ఈ బైక్‍ కు ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ టెక్నాలజీని కూడా కల్పించింది. ఎల్ఈడీ ఇన్‍స్ట్రుమెంటల్ క్లస్టర్ ఉంటుంది. ఈ బైక్ ఫ్రంట్‍ లో 41mm టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక అడ్జస్టబుల్ షోక్స్ ఉంటాయి. సస్పెన్షన్ చాలా మెరుగ్గా ఉంటుంది. దీంతో లాంగ్ ట్రావెల్స్ ఎంతో అనువుగా చేయవచ్చు. సిక్స్ -స్పీడ్ గేర్ బాక్స్, అసిస్ట్ స్లిప్పర్ క్లచ్‍తో హోండా సీఎం500 వస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu