Ad Code

బ్లూటిక్‌ ద్వారా అధిక ఆదాయం ?


టెస్లా సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌ అత్యంత భారీ మొత్తానికి ట్విట్టర్‌ను కొనుగోలు చేశాడు. కొన్ని నెలలుగా సాగిన  పరిణామాలకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ మస్క్‌ ఎట్టకేలకు ట్విట్టర్‌ను 44 బిలియన్లకు హస్తగతం చేసుకున్నాడు. టెక్‌ రంగంలో ఇదొక అతిపెద్ద డీల్‌గా నిపుణులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే కొనుగోలు వ్యవహారం ముగిసిందో లేదో మస్క్‌ తన మార్క్‌ను చూపించడం ప్రారంభించాడు. సంస్థ చేతికొచ్చిన తొలి రోజే అప్పటి వరకు సీఈఓ పరాగ్ అగర్వాల్‌ను తొలగించి తీవ్ర చర్చకు దారి తీశాడు. అంతేకాకుండా ఉద్యోగాలను భారీ ఎత్తున తొలగించేందుకు రంగం సిద్ధం చేశాడు. ఏకంగా 3700 మందిని ఇంటికి సాగనంపేందుకు  మస్క్‌ సిద్ధమవుతున్నాడు. అంతేకాకుండా ఇప్పటి వరకు ఉచితంగా అందిస్తున్న బ్లూటిక్‌ సేవలకు స్వస్తి పలికేందుకు సిద్ధమవుతున్నాడు. బ్లూటిక్‌ మార్క్‌ ఉండాలంటే నెలకు 20 డాలర్లు చెల్లించాలనే ప్రతిపాదన తీసుకొచ్చారు. ఈ నిర్ణయంపై తీవ్రంగా వ్యతిరేక రావడంతో 20 డాలర్లను కాస్త 8 డాలర్లకు తగ్గించారు. ఇదిలా ఉంటే ట్విట్టర్‌ను రూ. లక్షల కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఎలాన్‌ మస్క్‌ వడ్డీతో వసూలు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్టాటిస్టా అనే సర్వే ప్రకారం ప్రస్తుతం ట్విట్టర్‌కు మొత్తం 4,24,000 బ్లూటిక్‌ సబ్‌స్కైబర్స్‌ ఉన్నారు. ఈ లెక్కన వీరు నెలకు 8 డాలర్లు చెల్లిస్తే ట్వి్ట్టర్‌ కేవలం బ్లూటిక్‌ల ద్వారానే ప్రతీ నెల 3.4 మిలియన్‌ డాలర్లను రాబడుతోంది. అయితే బ్లూటిక్‌ పెయిడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ సంఖ్య తగ్గే అవకాశం ఉందన్న , మరోవైపు ఇంకొంత మంది ఈ సేవలను వినియోగించుకునే అవకాశం ఉంది కాబట్టి పెరిగే అవకాశం కూడా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ట్విట్టర్‌ ఇప్పటికే ప్రకటనల ద్వారా భారీ మొత్తాన్ని ఆర్జిస్తున్న విషయం తెలిసిందే.

Post a Comment

0 Comments

Close Menu