Ad Code

మ్యాటర్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రిక్ బైక్ విడుదల


ఎలక్ట్రిక్ బైక్స్ విభాగంలో తన సత్తా ఏంటో చాటడానికి 'మ్యాటర్ ఎనర్జీ' కంపెనీ తన ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్‌ను ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. మ్యాటర్ ఎనర్జీ లాంచ్ చేసిన ఈ కొత్త ఆధునిక ఎలక్ట్రిక్ బైక్ అద్భుతమైన డిజైన్, ఇంకా సూపర్ ఫీచర్స్ కలిగివుంది. ఇందులో 5.0 కిలోవాట్ లిక్విడ్-కూల్డ్ బ్యాటరీ ఉంటుంది. ఇది IP67 రేటెడ్ పొందిన ఎలక్ట్రిక్ బ్యాటరీ వల్ల దుమ్ము ఇంకా దూళి నుంచి రక్షణ పొందుతుంది. ఇది ఒక సింగిల్ ఛార్జ్ తో మాక్సిమం 125 కిమీ నుంచి 150 కిమీ రేంజ్ అందిస్తుందని ARAI వెరిఫై చేసింది.అయితే నిజానికి వివిధ వాతావరణ పరిస్థితుల్లో ఈ రేంజ్ కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ఇది 4-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ తో యాడ్ చేయబడి ఉంటుంది. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే, ఇది స్టాండర్డ్ ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ కావడానికి 5 గంటలు పడుతుంది. ఈ బైక్ డిజైన్ విషయానికి వస్తే, ఇది ప్రత్యేకమైన డిజైన్ ని కలిగి ఉంటుంది. ఇందులో LED టర్న్ సిగ్నల్స్ ఫ్యూయల్ ట్యాంక్‌పైన ఉంటాయి. అదే సమయంలో స్ప్లిట్ సీట్లు, క్లిప్ ఆన్ హ్యాండిల్‌బార్లు ఇంకా పిలియన్ కోసం స్ప్లిట్ గ్రాబ్ రైల్‌ వంటివి ఉన్నాయి. ఇంకా అంతే కాకుండా బై ఫంక్షనల్ LED హెడ్‌లైట్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఇది ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంటుంది.ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో 7.0 ఇంచెస్ LCD టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఉంటుంది. దీని ద్వారా రైడర్ బైక్ గురించి చాలా సమాచారం పొందవచ్చు. ఇందులో రిమోట్ లాక్/అన్‌లాక్, జియోఫెన్సింగ్, లైవ్ లొకేషన్ ట్రాకింగ్, వెహికల్ హెల్త్ మానిటరింగ్, ఛార్జింగ్ స్టేటస్ ఇంకా అలాగే పుష్ నావిగేషన్ వంటి ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu