Ad Code

వీఎల్‌సీ మీడియా ప్లేయర్‌పై నిషేధం ఎత్తివేత !


దేశంలో తొమ్మిది నెలల పాటు బ్యాన్ అయిన ప్రముఖ మీడియా ప్లేయర్ VLC వెబ్‌సైట్ తాజాగా తిరిగి అందుబాటులోకి వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వీఎల్‌సీ మీడియా ప్లేయర్‌ని ఆపరేట్ చేసే VideoLAN వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయాలని ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి ఇండియాలో ఈ మీడియా ప్లేయర్ వెబ్‌సైట్‌పై నిషేధం కొనసాగింది. తాజాగా మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌పై బ్యాన్‌ను ఎత్తేసింది. వీఎల్‌సీ మీడియా ప్లేయర్ వెబ్‌సైట్ బ్యాన్‌ను నవంబర్ 14న కేంద్రం తొలగించింది ఇకపై ఇండియన్ యూజర్స్ ఆ వెబ్‌సైట్ సేవలను పొందొచ్చు. ముఖ్యంగా అఫీషియల్ వెబ్‌సైట్‌ నుంచే వీఎల్‌సీ మీడియా ప్లేయర్‌ని, దాని అప్‌డేట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. భారతీయుల సున్నితమైన వ్యక్తిగత డేటాను శత్రు దేశానికి ట్రాన్స్‌ఫర్ చేస్తున్న 'Onmyoji Arena' (గతంలో బ్లాక్ అయిన) యాప్ లేదా సాఫ్ట్‌వేర్‌ సర్వర్‌లతో కనెక్ట్ అయి ఉన్నందున VLC వెబ్‌సైట్‌పై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఢిల్లీకి చెందిన డిజిటల్ రైట్స్‌ గ్రూప్ 'ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్' సహాయంతో VideoLAN కంపెనీ భారతదేశంలో సైట్ బ్లాక్ చేయబడటానికి గల కారణాలను తెలుసుకోవాలని కోరుతూ మంత్రిత్వ శాఖకు లీగల్ నోటీసును జారీ చేసింది. ఈ నోటీసులను అందుకున్న మంత్రిత్వ శాఖ సోమవారం VideoLANకి ఒక ఈమెయిల్ పంపింది. videolan.org డొమైన్‌ను అన్‌బ్లాక్ చేస్తున్నామని ఈ-మెయిల్‌లో వెల్లడించింది. ఇంటర్నెట్ ఫ్రీడమ్‌ ఫౌండేషన్ కూడా ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. బ్యాన్ లిఫ్ట్ చేయడానికి కారణం ఏంటో ప్రభుత్వం వెల్లడించలేదు. తన అక్టోబర్ లేఖలో మంత్రిత్వ శాఖ సైబర్ అటాక్స్‌ చేయడానికి VLC మీడియా ప్లేయర్‌ను చైనా-మద్దతుగల హ్యాకింగ్ గ్రూప్ 'సికాడా' ఉపయోగించిందని కొన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం నిర్ధారించింది. ఐతే నిషేధాన్ని తొలగించుకునేందుకు వీడియోలాన్ తన వెబ్‌సైట్ శత్రువు దేశంలోని సర్వర్‌లకు కనెక్ట్ అయివుందనే ఆరోపణలను ఖండించింది. తన వెబ్‌సైట్ ఆల్రెడీ బ్లాక్ అయిన సదరు యాప్ సర్వర్లకు ఎలాంటి యూజర్ డేటాను ట్రాన్స్‌ఫర్ చేయడం లేదని కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. తన యూజర్ల డేటా అంతా ఫ్రాన్స్ లోనే ఉందని స్పష్టం చేసింది. VLC మీడియా ప్లేయర్‌ను 8 కోట్ల మంది ఇండియన్ యూజర్లు ఉపయోగిస్తున్నారని, వెబ్‌సైట్ బ్లాక్ చేయడం వల్ల వారు అనధికారిక థర్డ్-పార్టీ వెబ్‌సైట్‌ల నుంచి అప్లికేషన్ అప్‌డేట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవలసి వస్తుందని.. తద్వారా వారికి డేటా థెఫ్ట్, సైబర్‌ సెక్యూరిటీ రిస్క్స్‌ మరింత పెరగొచ్చని కూడా VideoLAN తెలిపింది. మొత్తానికి అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం బ్యాన్ ఎత్తివేసింది.

Post a Comment

0 Comments

Close Menu