Ad Code

ట్వీట్ సైజ్​ను పెంచనున్న ట్విట్టర్ !


ఎలాన్ మస్క్ సారథ్యంలో ట్విట్టర్ లో ఎన్నో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయని చెప్పవచ్చు. ట్విట్టర్ ను మరింత చురుకైన, మెరుగైన వేదికగా మార్చాలని మస్క్ విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. అందులో భాగంగా ట్వీట్ లో అక్షరాల పరిమితిని పెంచనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఒక ట్వీట్ లో 280 క్యారెక్టర్ల వరకు టైప్ చేసే వెసులుబాటు ఉంది. కాగా ఈ పరిమితిని 420కు పెంచే అవకాశం ఉంది. దీనివల్ల యూజర్లు తమ భావాలను మరింత వివరంగా చెప్పే వీలు కలుగుతుంది. ''మస్క్ ట్విట్టర్ 2.0లో తప్పకుండా క్యారెక్టర్ల పరిమితిని 280కు బదులు 420 చేయాలి'' అంటూ ఓ ట్విట్టర్ యూజర్ ట్వీట్ చెయ్యగా దానికి మస్క్ స్పందిస్తూ మంచి ఆలోచన అంటూ సమాధానం ఇచ్చారు. దానితో త్వరలోనే ఈ కొత్త అప్డేట్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు నెట్టింట ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ట్విట్టర్ ఆరంభంలో 140 క్యారెక్టర్లనే ఒక ట్వీట్ లో అనుమతించగా క్రమంగా 2018లో దీన్ని 280 క్యారెక్టర్లకు పెంచింది. ఇప్పుడది తర్వలో 420 క్యారెక్టర్లకు మారనుందని తెలుస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu