Ad Code

ఓమోటెనాషి ప్రతిస్పందన లేదు !


నాసా ప్రయోగించిన ఆర్టెమిస్‌-1 మిషన్‌ విజయవంతమైంది. చంద్రుడి చుట్టూ తిరుగుతున్న ఓరియన్‌ క్యాప్సూల్‌ చంద్రుడి అద్భుతమైన ఫొటోలను భూమిపైకి పంపుతున్నది. ఈ మిషన్‌ విజయవంతం కావడంతో నాసా శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇదే మిషన్‌లో చంద్రుడిపైకి వెళ్లిన జపాన్‌కు చెందిన రెండు క్యూబ్‌శాట్‌లలో ఒకదాని నుంచి ఎలాంటి స్పందన రావడంలేదు. చంద్రుడిపైకి పంపించిన మూన్‌ల్యాండర్లలో ప్రపంచంలోనే ఓమోటెనాషి అతి చిన్నది కావడం విశేషం. నాసాకు చెందిన ఓరియన్‌ క్యాప్సూల్‌ మిషన్‌ నుంచే జపాన్‌కు చెందిన రెండు క్యూబ్‌శాట్‌లను కూడా జాబిలిపైకి పంపించారు. ఆర్టెమిస్‌-1 మిషన్‌తోనే ఓమోటెనాషి, ఈక్యూలియస్‌లను కూడా ప్రయోగించారు. అయితే ఈక్యూలియస్‌ సాధారణంగా పనిచేస్తుండగా.. రెండోది ఓమోటెనాషి నుంచి మాత్రం ఎలాంటి ప్రతిస్పందన లేదని జపనీస్‌ ఏరోస్పేస్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ఏజెన్సీ (జాక్సా) తెలిపింది. ఇలా జరగడానికి గల కారణాలను పరిశోధించేందుకు, భవిష్యత్‌లో ఫెయిల్యూర్‌ జరుగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని, క్యూబ్‌శాట్‌ అభివృద్ధిపై మరింత పరిశోధన జరపాలని యోచిస్తున్నట్లు జాక్సా బృందం ఒక ప్రకటనలో తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu