Ad Code

ప్లీజ్ వెనక్కి రండి !


ట్విట్టర్ ను కొనాలని నిర్ణయించుకున్నప్పటి నుంచి ఎలాన్ మస్క్ వ్యవహరిస్తున్న తీరు తల తిక్కగానే ఉంది. ముందు ట్విట్టర్ కొంటానని ప్రకటించడమే కాదు అందులోని మెజార్టీ షేర్ లను అతి ఎక్కువ ధరకు కొనేశాడు. పైగా మిగతా షేర్ లను కూడా కొనడానికి అతి ఎక్కువ ధరను ఆఫర్ చేసి ఒప్పందం చేసుకున్నాడు. అయితే కొద్ది రోజులకే తాను పెట్టిన ధర చాలా ఎక్కువగా ఉందని గ్రహించి ఆ ఒప్పందం నుంచి వైదొలగడానికి ప్రయత్నించాడు. దానికి అనేక సాకులు చెప్పాడు. చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో ట్విట్టర్ ను కొనాల్సి వచ్చింది మాస్క్. ట్విట్టర్ కొనడంతో ఆగలేదాయన ఆ సంస్థలో ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ళందరినీ తీసిపడేశారు. అంతే కాదు ఉద్యోగుల్లో సగం మందిని, అంటే 3700 మందిని హటాత్తుగా , నోటీసులు కూడా లేకుండా తొలగించాడు.  అందులో కొంత మందిని తిరిగి వెనక్కి పిలిచాడు. వారిని పొరపాటున తొలగించామని వాళ్ళ అవసరం సంస్థకు చాలా ఉందని, కాబట్టి వాళ్ళంతా తిరిగి వెనక్కి వచ్చి ఉద్యోగాల్లో చేరాలని ఎలాన్ మస్క్ విజ్ఞప్తి చేశారు. వారందరికీ ఈ మెయిల్స్ పంపింది ట్విట్టర్ యాజమాన్యం. దీన్నిబట్టి ఉద్యోగుల తొలగింపు కార్యక్రమం ఎంత గందరగోళంగా జరిగిందో అర్దమవుతోంది. మస్క్ చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వినవస్తున్నాయి. మరో వైపు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, సమయం ఇవ్వకుండా తమను తొలగించడం పై ఉద్యోగాలు పోయిన ట్విట్టర్ మాజీ ఉద్యోగులు కోర్టును ఆశ్రయించనున్నారు.

Post a Comment

0 Comments

Close Menu