Ad Code

టెక్స్ట్ మెసేజెస్‌ని షెడ్యూల్ చేయ్యడమెలా ?


గూగుల్ డిఫాల్ట్ మెసేజ్ యాప్‌లో కొత్తకొత్త ఫీచర్స్ వస్తున్నాయి. ప్రతీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ మెసేజెస్ యాప్ డిఫాల్ట్ మెసేజింగ్ యాప్‌గా లభిస్తుంది. కొందరు ఈ యాప్ వాడకుండా థర్డ్ పార్టీ మెసేజింగ్ యాప్ డౌన్‌లోడ్ చేసి వాడుతుంటారు. కానీ గూగుల్ మెసేజెస్ యాప్ వాడేవారే ఎక్కువ. ఇప్పుడు గూగుల్ మెసేజెస్ యాప్‌లో ఎస్ఎంఎస్ షెడ్యూల్ చేసే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అంటే మీరు ఎవరికైనా భవిష్యత్తులో ఏదైనా మెసేజ్ పంపాలనుకుంటే ముందే టైప్ చేసి, టైమ్ సెట్ చేసి పెట్టుకోవచ్చు. ఉదాహరణకు ఎవరికైనా భవిష్యత్తులో బర్త్ డే మెసేజ్ యాప్ పంపాల్సి ఉంటే మెసేజ్ టైప్ చేసి, ఆ డేట్ సెలెక్ట్ చేస్తే చాలు. సరిగ్గా ఆ టైమ్‌కి ఎస్ఎంఎస్ డెలివరీ అవుతుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు మెసేజెస్ షెడ్యూల్ చేసేందుకు ఇన్నాళ్లూ థర్డ్ పార్టీ యాప్ ఉపయోగించేవారు. ఇప్పుడు థర్డ్ పార్టీ యాప్ వాడాల్సిన అసరం లేకుండా స్మార్ట్‌ఫోన్‌లో డిఫాల్ట్‌గా లభించే గూగుల్ మెసేజెస్ యాప్‌లో మెసేజ్ షెడ్యూల్ చేయొచ్చు. ముందు మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ మెసేజెస్ యాప్ ఓపెన్ చేసి, ఎవరికి మెసెజ్ పంపాలనుకుంటున్నారో వారి పేరు సెలెక్ట్ చేయాలి. తరువాత మెసేజ్ టైప్ చేసి సెండ్ బటన్ పైన లాంగ్ ప్రెస్ చేయాలి. Schedule Send ఆప్షన్ సెలెక్ట్ చేసి  ఆ తర్వాత Select date and time పైన క్లిక్ చేయాలి.  క్యాలెండర్‌లో డేట్ సెలెక్ట్ చేసి, ఆ తర్వాత టైమ్ సెలెక్ట్ చేసి, Save పైన క్లిక్ చేస్తే చాలు. మెసేజ్ షెడ్యూల్ అవుతుంది. మీరు ఒకసారి షెడ్యూల్ చేసిన మెసేజ్‌ను మాడిఫై చేయొచ్చు లేదా డిలిట్ చేయొచ్చు. షెడ్యూల్ చేసినా వెంటనే పంపాలనుకుంటే మెసేజ్ పంపొచ్చు. వేర్వేరు దేశాల్లో నివసించేవారికి మెసేజెస్ పంపడానికి, బిజీగా ఉండేవారికి ఎస్ఎంఎస్ చేయడానికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది.

Post a Comment

0 Comments

Close Menu