Ad Code

ట్విట్టర్‌లో కొత్తగా 'అఫీషియల్' లేబుల్ ?


ఎలాన్ మస్క్ ట్విట్టర్‌లో బ్లూ టిక్ వెరిఫికేషన్‌తో కూడిన ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను కొన్ని దేశాల్లో పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారెవరైనా సరే బ్లూటిక్ చెక్ మార్క్‌ పొందొచ్చు. దీనివల్ల ఒక అకౌంట్ అథెంటిసిటీ లేదా వాస్తవికత తెలుసుకోవడం కష్టమవుతుందని ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన మీడియా హౌజ్‌లు, గవర్నమెంట్ అకౌంట్స్, కమర్షియల్ కంపెనీలు, బిజినెస్ పార్ట్‌నర్స్‌, పబ్లిషర్లు, కొంతమంది పబ్లిక్ ఫిగర్స్ సహా మరికొన్ని అకౌంట్స్‌ కోసం 'Official' లేబుల్‌ను పరిచయం చేసేందుకు ట్విట్టర్ ప్లాన్ చేస్తోందని సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఎస్తేర్ క్రాఫోర్డ్ తెలిపారు. అప్‌గ్రేడెడ్ ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ను పర్యవేక్షిస్తున్న ట్విట్టర్ వైస్ ప్రెసిడెంట్ ఎస్తేర్ క్రాఫోర్డ్ వరుస ట్వీట్‌లలో అఫీషియల్ లేబుల్‌ గురించి తెలిపారు. "బ్లూ కలర్ చెక్‌మార్క్‌లు అందరికీ అందుబాటులోకి వస్తే.. అఫీషియల్‌గా వెరిఫైడ్ అకౌంట్స్‌ గల ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్స్‌ ఎవరనేది గుర్తించడమెలా? అని చాలామంది అడుగుతున్నారు. అందుకే మేం సెలెక్టెడ్ అకౌంట్స్‌కి 'అఫీషియల్'ని పరిచయం చేస్తున్నాం" అని ఆమె పేర్కొన్నారు. కొత్తగా 7.99 డాలర్ల ధరతో వస్తున్న ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ పెయిడ్ యూజర్ల ఖాతాలపై బ్లూ చెక్ మార్క్‌లను అందిస్తుంది. కానీ యూజర్ల ఐడెంటిటీని ధ్రువీకరించదు. ఐడీ వెరిఫికేషన్ లేకపోవడం వల్ల సామాన్య ప్రజలు పబ్లిక్ ఫిగర్స్‌గా నటించే అవకాశం గురించి ఆందోళనలు పెరిగే అవకాశం ఉంది.  ఇప్పటికే, ఇలాంటి ఆందోళనల నడుమ మంగళవారం యూఎస్ మధ్యంతర ఎన్నికలు ముగిసే వరకు ట్విట్టర్ బ్లూ కొత్త వెర్షన్‌ను ప్రారంభించడాన్ని నిలిపివేసినట్లు ట్విట్టర్ సేఫ్టీ అండ్ ఇంటిగ్రిటీ హెడ్ యోయెల్ రోత్ ట్వీట్ చేశారు. ప్రభుత్వ అధికారుల పేరుతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి వారి లాగా నటించే సమస్య ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్‌లో జరుగుతూనే ఉంటుంది. బ్లూ చెక్ మార్కు వస్తే ఈ సమస్య మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అయితే అఫీషియల్ లేబుల్‌తో ఈ సమస్యకు ట్విట్టర్ చెక్ పెట్టనుంది. ఈ లేబుల్‌ను పొందే ఖాతాలలో ప్రభుత్వాలు, వాణిజ్య సంస్థలు, వ్యాపార భాగస్వాములు, ప్రధాన మీడియా సంస్థలు, ప్రచురణకర్తలు, మరికొందరు పబ్లిక్ ఫిగర్స్‌ ఉంటారని క్రాఫోర్డ్ ట్వీట్ చేశారు. కాగా గతంలో బ్లూ చెక్ మార్క్‌తో వెరిఫికేషన్ పొందిన అన్ని ట్విట్టర్ అకౌంట్స్‌కి "అఫీషియల్" లేబుల్‌ను అందించమని, అది కొనుగోలుకు కూడా అందుబాటులో ఉండదని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ అధికారులు వెరిఫైడ్ చెక్‌మార్క్‌ల కోసం మనీ చెల్లించడానికి ఇష్టపడరు. దీనివల్ల వారు సామాన్య యూజర్స్ వలె కనిపించే అవకాశం ఉన్నందున అఫీషియల్ లేబుల్ తీసుకురావాలని ట్విట్టర్ పాలసీ ఎగ్జిక్యూటివ్స్‌ ఆలోచన చేశారు. ఈ వారం మైక్రోబ్లాగింగ్ సైట్‌లో కంపెనీ కొత్త మార్పులను తీసుకు రానున్న వేళ ట్విట్టర్ బ్లూ అకౌంట్, అఫీషియల్ వెరిఫైడ్‌ అకౌంట్స్‌ మధ్య వ్యత్యాసాన్ని అఫీషియల్ లేబుల్‌తో చూపిస్తామని అధికారులు క్లారిటీ ఇచ్చారు. 

Post a Comment

0 Comments

Close Menu