Ad Code

హాలిడే సీజన్ ఫ్రాడ్స్‌తో జాగ్రత్త !


స్కామ్స్, ఫేక్ యాంటీవైరస్ వంటి గురించి ఎప్పటికప్పుడు గూగుల్ యూజర్లను అలర్ట్ చేస్తుంటుంది. తాజాగా హాలిడే సీజన్‌లో ఐదు కీలక స్కామ్స్, స్పామ్స్ గురించి జీమెయిల్ యూజర్లను అప్రమత్తం చేసింది. ప్రధానంగా గిఫ్ట్ కార్డ్, గివ్‌వే ఫ్రాడ్స్, ఛారిటీ రిలేటెడ్ స్కామ్స్, డెమోగ్రాఫిక్ టార్గెటింగ్ స్కామ్స్, సబ్‌స్క్రిప్షన్ రెన్యూవల్స్ ఫ్రాడ్స్, క్రిప్టో స్కామ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, హాలిడే సీజన్‌లో వాటికి దూరంగా ఉండాలని గూగుల్ హెచ్చరించింది. సాధారణంగా యూజర్లు పీక్ హాలిడే సీజన్‌లో గిఫ్ట్ కార్డ్, గివ్ వే ఫ్రాడ్స్‌ బారిన పడే అవకాశం ఉంటుందని గూగుల్ తెలిపింది. గిఫ్ట్‌కార్డ్‌ కొనుగోలు చేసేలా బాధితులను మోసం చేయడానికి వివిధ మార్గాల్లో ప్రయత్నించవచ్చని పేర్కొంది. స్కామర్స్ పరిచయం ఉన్న వ్యక్తుల వలె నటించడం ద్వారా లేదా క్రెడిట్ కార్డ్ నంబర్‌ చెబితే బదులుగా ఉచిత బహుమతిని అందించడం వంటి ద్వారా యూజర్లను మోసం చేసే అవకాశం ఉందని తెలిపింది. ఛారిటీ-రిలేటెడ్ స్కామ్స్, ఫిషింగ్ ప్రయత్నాల ద్వారా మోసాలకు గురైన బాధితులు, విరాళాల నుంచి ప్రయోజనం పొందే స్వచ్ఛంద సంస్థలు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల ఇమెయిల్స్ పట్ల యూజర్లు అప్రమత్తంగా ఉండాలని గూగుల్ కోరింది. లోకల్ పేరెంట్ - టీచర్ అసోసియేషన్(PTA) బోర్డు సభ్యులు పంపే మెయిల్స్ రూపంలో కొన్ని ఫేక్ మెయిల్స్ ఉండవచ్చు. లేదా నిర్దిష్ట ఏజ్ గ్రూప్స్‌ను లక్ష్యంగా చేసుకోని ఫేక్ ఈమెయిల్స్‌తో మోసం చేయడానికి ఆస్కారం ఉందని గూగుల్ పేర్కొంది. మెంబర్‌షిప్ రెన్యూవల్‌తో కూడిన స్కామ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని గూగుల్ సూచించింది. సెక్యూరిటీని మరింత పెంచుతాయనే హామీతో బాధితులను ఆకర్షించే ప్రయత్నంలో ఫేక్ యాంటీవైరస్ సర్వీస్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. దీంతో మెయిల్ లోని సమాచారం హ్యాక్ అయ్యే అవకాశం ఉందని గూగుల్ పేర్కొంది. క్రిప్టో-బేస్డ్ మోసాలు తరచుగా వివిధ రూపాల్లో ఉంటాయి. బాధితులను బెదిరించి వారి నుంచి డబ్బు వసూలు చేయడానికి ప్రయత్నించడం, బ్లాక్‌మెయిల్ చేయడం.. వంటి మోసాలను ఎదుర్కోవాలని గూగుల్ చెబుతోంది. కొంతమంది స్కామర్స్, వారు పంపే మెసేజ్‌లను అద్భుతమైన స్కిల్స్‌తో ఇతరులు నమ్మేలా చేస్తారు. అందుకే యూజర్లు ఎల్లప్పుడూ తమకు వచ్చిన ఇమెయిల్‌ను జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఏదైనా తప్పుగా అనిపిస్తే, అది నకిలీది కావచ్చు. వాటిని వెంటనే డిలీట్ చేయాలి. టెక్ దిగ్గజం రోజుకు 15 బిలియన్ల అన్ వాంటెడ్ మేసేజస్ నుంచి యూజర్లను ప్రొటెక్ట్ చేస్తోంది. అంతేకాకుండా స్పామ్, ఫిషింగ్, మాల్వేర్లకు సంబంధించి దాదాపు 99.9 శాతానికి పైగా బ్లాక్ చేస్తున్నట్లు కంపెనీ బ్లాగ్‌పోస్ట్‌లో పేర్కొంది.

Post a Comment

0 Comments

Close Menu