Ad Code

ప్రీమియం ఫోన్ అద్దెకిస్తాం !


నోకియా ప్రీమియం స్మార్ట్ ఫోన్  రెంట్ చెల్లించి ఉపయోగించుకోవచ్చని, నోకియా చెబుతోంది. నోకియా తీసుకువస్తున్న ఈ కొత్త నిర్ణయంతో నామమాత్రపు అద్దెను చెల్లించి ప్రీమియం ఫోన్ ను అద్దెకు తీసుకొని వాడుకోవచ్చు.  ఈ ఆఫర్ తో కంపెనీ యొక్క పర్యావరణ అనుకూల స్మార్ట్ ఫోన్ Nokia X30 5Gని అద్దెకు తీసుకొని ఉపయోగించవచ్చు. రూ.42,300 విలువైన Nokia X30 5G స్మార్ట్ ఫోన్ ను నెలకు రూ. 2,033 చెల్లించి అద్దెకు తీసుకోవచ్చు. అయితే, ఈ రెంటల్ సర్వీస్ ను మీరు కనీసం మూడు నెలల పాటు ఉపయోగించాల్సి ఉంటుందని నోకియా చెబుతోంది. అంతేకాదు, ఈ సర్వీస్ సమయంలో ఫోన్ కోల్పోయిన లేదా పాడైన ఆ స్మార్ట్ ఫోన్ లను తిరిగి కంపెనీ భర్తీ చేస్తుంది, అని కూడా చెబుతోంది. ప్రస్తుతానికి ఇతర దేశాల్లో అందుబాటులో ఉన్న ఈ సర్వీస్ ను నోకియా త్వరలోనే భారతదేశంలో కూడా పరిచయం చేయబోతోంది.

Post a Comment

0 Comments

Close Menu