Ad Code

బాల ఆధార్ కార్డుపై కొత్త మార్గదర్శకాలు !


బాల ఆధార్‌కు సంబంధించి విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ  కొత్త మార్గదర్శకాన్ని విడుదల చేసింది. 5 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలకు ఆధార్ డేటాలో బయోమెట్రిక్ డేటాను అప్‌డేట్ తప్పనిసరి చేస్తూ అథారిటీ మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు UIDAI ట్విట్టర్‌లో వెల్లడించింది. 5-15 సంవత్సరాల మధ్య పిల్లల బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేయడం తప్పనిసరి చేసినట్టు తెలిపింది. ఈ ప్రక్రియ ఉచితంగానే ఉంటుందని తెలియజేసింది. దాంతో పాటు బయోమెట్రిక్‌లను అప్‌డేట్ చేసిన తర్వాత పిల్లల ఆధార్ నంబర్‌లో ఎలాంటి మార్పు ఉండదని UIDAI మరో ట్వీట్‌లో ప్రకటించింది. తల్లిదండ్రులు ఫారమ్‌ను నింపడానికి వారి పిల్లల బయోమెట్రిక్ డేటాను అప్‌డేట్ చేయడానికి సమీపంలోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కేంద్రాన్ని సందర్శించాలని కోరింది. UIDAI అధికారిక పోస్ట్‌లో పిల్లల ఆధార్‌కు రెండు తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్‌లు అవసరమని తెలియజేసింది. పిల్లలకి 5 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు మొదటి బయోమెట్రిక్ అప్‌డేట్ చేయాలి. ఆ తర్వాత15 ఏళ్ల వయస్సులో రెండవది చేయాలి. 12-అంకెల ఆధార్‌ను నియంత్రించే UIDAI 5 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు బాల్ ఆధార్ కార్డ్‌ను జారీ చేస్తుంది. పుట్టినప్పటి నుంచి పిల్లలకు డిజిటల్ ఫోటో గుర్తింపు రుజువుగా వివిధ సంక్షేమ ప్రయోజనాలు, విధులకు కార్డ్ యాక్సెస్‌ను అందిస్తుంది. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో వేలిముద్రల వంటి బయోమెట్రిక్‌లు స్పష్టంగా కనిపించవు. కాబట్టి. వేలిముద్రలు, ఐరిస్ స్కాన్‌ల వంటి బయోమెట్రిక్ డేటా బాల్ ఆధార్ కార్డ్‌లో చేర్చరు. కాబట్టి పిల్లలు ఐదేళ్ల వయస్సు వచ్చిన తర్వాత వారి బయోమెట్రిక్‌లను అప్‌డేట్ చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. సాధారణ ఆధార్ నుంచి బాల్ ఆధార్‌ను వేరు చేసేందుకు UIDAI 0-5 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు బ్లూ కలర్ ఆధార్ కార్డ్‌లను జారీ చేస్తుంది. బిడ్డకు 5 ఏళ్లు వచ్చిన తర్వాత బ్లూ కలర్ బాల్ ఆధార్ చెల్లదు. ఆధార్‌ను అప్‌డేట్ చేసేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఐదు సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత వారి బయోమెట్రిక్‌లతో ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయాలి. పిల్లల ఆధార్‌లో బయోమెట్రిక్‌లను అప్‌డేట్ చేసేందుకు uidai.gov.inని విజిట్ చేయండి. పిల్లల ఆధార్ కార్డ్ వివరాలను అప్‌డేట్ చేయడానికి అపాయింట్‌మెంట్ బుక్ చేయండి.  పిల్లల జనన ధృవీకరణ పత్రం, గుర్తింపు రుజువు, చిరునామా డాక్యుమెంట్లతో ఆధార్ నమోదు కేంద్రాన్ని విజిట్ చేయండి. బాల్ ఆధార్ కార్డ్‌ని రిజిస్టర్ చేసేటప్పుడు లేదా అప్‌డేట్ చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు కూడా తమ ఆధార్ కార్డ్‌ని సమర్పించాలి. ఆధార్ ఎగ్జిక్యూటివ్ పిల్లల ఫేస్ ఫొటో, వేలిముద్రల వంటి బయోమెట్రిక్‌లను యాడ్ చేస్తారు. ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ఆధార్ ఎగ్జిక్యూటివ్ ఇచ్చిన రసీదు స్లిప్‌ను జాగ్రత్త చేసి పెట్టుకోవాలి. 

Post a Comment

0 Comments

Close Menu