Ad Code

మాస్టోడాన్‌కు మారుతున్న ట్విట్టర్ యూజర్లు ?


ఎలోన్ మస్క్ ట్విట్టర్ పగ్గాలు అందుకున్న కొద్ది రోజుల తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకున్నాడు. ప్రాథమిక ఫీచర్‌లు లేదా సర్వీసులతో డబ్బు ఆర్జించాలనే మస్క్ ప్రణాళికల కారణంగా ట్విట్టర్ యూజర్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ బ్లూ టిక్, మానిటైజేషన్, లాంగ్ వీడియోలను పోస్ట్ చేయడం, ఇతర ఫీచర్ల వినియోగంపై యూజర్ల నుంచి 8 డాలర్లు వసూలు చేస్తున్నట్టు మస్క్ ప్రకటించాడు. కొన్ని వీడియోలను వీక్షించినందుకు యూజర్ల నుంచి ఛార్జీలు వసూలు చేయాలని కూడా మస్క్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.  వెరిఫికేషన్ బ్యాడ్జ్ కోసం ఛార్జీలు వసూలు చేయడంతో పాటు వేలాది మంది ట్విట్టర్ ఉద్యోగులను తొలగించడం వంటి నిర్ణయాలపై చాలా మంది యూజర్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా మంది ట్విట్టర్ యూజర్లు ఇతర ప్లాట్‌ఫారమ్‌లకు మారాలని నిర్ణయించుకున్నారు. రెడ్దిట్ వంటి అనేక ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నప్పటికీ.. ట్విట్టర్ యూజర్లు చాలామంది మాస్టోడాన్‌ కు మారిపోతున్నట్టు సమాచారం. గత వారమే 2లక్షల 30వేల మంది కొత్త యూజర్లు మాస్టోడాన్‌లో చేరారని ప్లాట్‌ఫారమ్ బృందం తెలిపింది. వారందరూ ట్విట్టర్ వినియోగదారులా కాదా అనేది క్లారిటీ ఇవ్వలేదు. మాస్టోడాన్‌ ప్లాట్ ఫారంలో సైన్ అప్ అయ్యాక ప్లాట్‌ఫారమ్‌లో రెండు హ్యాష్‌ట్యాగ్‌లు #Twitterreufugees, #Introduction ట్రెండింగ్‌లో ఉన్నాయి. మాస్టోడాన్ అనేది ఒక ఓపెన్ సోర్స్ మైక్రో-బ్లాగింగ్ సైట్.  ట్విట్టర్ నుంచి కొంచెం భిన్నంగా పనిచేస్తుంది. ఈ ప్లాట్ ఫారం డిసెంట్రలైజ్ పద్ధతిలో పనిచేస్తుంది. ట్విట్టర్ మాదిరిగా కాకుండా వినియోగదారుల వద్దనే సర్వర్లు ఉన్నాయి. చాలా సర్వర్‌లు అకా కమ్యూనిటీలను కలిగి ఉన్న విభిన్న కేటగిరీలు ఉన్నాయి. యూజర్లు వారి ఆసక్తి ఆధారంగా వాటిలో ఏ సర్వర్లలోనైనా చేరవచ్చు. ఉదాహరణకు.. ఎవరైనా యూజర్ 'General' కేటగిరీలో C.IM సర్వర్‌ని ఎంచుకుంటే.. సాధారణ, ప్రధానంగా ఇంగ్లీష్ మాట్లాడే మాస్టోడాన్ కమ్యూనిటీగా చెప్పవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu