Ad Code

boAt వేవ్ అల్టిమా బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్ !


boAt బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో కొత్త స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేసింది. boAt Wave Ultima అనేది కంపెనీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్. వేరబుల్ స్మార్ట్ వాచ్ నుంచి నేరుగా కాల్‌ చేసుకునేందుకు యూజర్లకు అనుమతిస్తుంది. వాచ్‌లో పెద్ద సూపర్ బ్రైట్ క్రాక్-రెసిస్టెంట్ కర్వ్ ఆర్క్ డిస్‌ప్లే కూడా ఉంది. హెల్త్, ఫిట్‌నెస్ ఫీచర్‌లను కూడా కలిగి ఉంది. అల్టిమా అందించే కొన్ని ఫీచర్లు ఈ సెగ్మెంట్‌లోని మరే ఇతర బ్రాండ్ లోనూ అందుబాటులో లేవని కంపెనీ పేర్కొంది. boAt అనేది సరసమైన కేటగిరీలో అత్యంత డిమాండ్ ఉన్న ఎలక్ట్రానిక్స్ బ్రాండ్‌లలో ఒకటిగా చెప్పవచ్చు. boAt ప్రస్తుతం మార్కెట్‌లో 30కి పైగా స్మార్ట్‌వాచ్‌లను విక్రయిస్తోంది. boAt Wave Ultima ఈ సెగ్మెంట్‌లో కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి మొదటి స్మార్ట్‌వాచ్. మార్కెట్లో బోట్ వేవ్ అల్టిమా ధర రూ. 2,999గా ఉంది. ఈ వాచ్ boAt, Flipkart అధికారిక వెబ్‌సైట్ నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు. వాచ్ ర్యాగింగ్ రెడ్, యాక్టివ్ బ్లాక్, టీల్ గ్రీన్‌తో సహా మూడు విభిన్న స్ట్రాప్ ఆప్షన్లలో వస్తుంది. 1.8-అంగుళాల కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఎడ్జ్-టు-ఎడ్జ్ ఆల్వేస్ ఆన్ ఫీచర్. ఉన్నతమైన కనెక్టివిటీ కోసం.. వాచ్ బ్లూటూత్ v5.3కి సపోర్టుతో వస్తుంది. చిప్‌సెట్ స్పష్టమైన BT కాల్‌లకు కూడా పనిచేస్తుంది. ఇంటర్నల్ HD స్పీకర్, హై-సెన్సిటివిటీ మైక్రోఫోన్ కారణంగా రెండు వైపులా వాచ్ క్లారిటీగా వినిపిస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu