Ad Code

శాంసంగ్ ఎం04 సేల్ ప్రారంభం !


శాంసంగ్ ఇటీవలే లాంచ్ చేసిన గెలాక్సీ ఎం04 స్మార్ట్ ఫోన్‌ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. అమెజాన్, శాంసంగ్ అధికారిక వెబ్ సైట్లలో కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎం04లో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను కూడా అందించారు. ఫ్రంట్ కెమెరా కోసం వాటర్ డ్రాప్ తరహా నాచ్ కూడా ఉంది. ఇందులో ర్యామ్ ప్లస్ ఫీచర్ అందించారు. ఈ ఫీచర్ ద్వారా ర్యామ్‌ను 8 జీబీ వరకు పెంచుకునే ఆప్షన్ ఉంది. 128 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్‌లో అందించారు. రియల్‌మీ, రెడ్‌మీ బడ్జెట్ ఫోన్లతో శాంసంగ్ గెలాక్సీ ఎం04 పోటీ పడనుంది. ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర రూ.8,499గా నిర్ణయించారు. బ్లూ, గోల్డ్, మింట్ గ్రీన్, వైట్ కలర్ ఆప్షన్లలో శాంసంగ్ గెలాక్సీ ఎం04 కొనవచ్చు. దీనిపై పలు లాంచ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే అందించారు. వాటర్ డ్రాప్ తరహా నాచ్ ఈ ఫోన్‌లో ఉంది. మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్‌పై శాంసంగ్ గెలాక్సీ ఎం04 పని చేయనుంది. 5000 ఎంఏహెచ్ సామర్థ్యం ఉన్న బ్యాటరీని ఈ ఫోన్‌లో అందించారు. కెమెరా విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ర్యామ్ ప్లస్ ఫీచర్‌ను అందించారు. దీని ద్వారా ర్యామ్‌ను మొత్తంగా 8 జీబీ వరకు పెంచుకోవచ్చు. 128 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉంది. మైక్రో ఎస్‌డీ ద్వారా దీన్ని 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్ యూఐ 4.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది.

Post a Comment

0 Comments

Close Menu