Ad Code

ఫిబ్రవరి 10న వన్‌ప్లస్ 11 విడుదల


దేశీయ మార్కెట్లో ఫిబ్రవరి 10న వన్‌ప్లస్ 11 లాంఛ్ కానుండగా,  చైనా మార్కెట్‌లో జనవరి 4న  లాంఛ్ కానుంది. అఫిషియల్ లాంఛ్‌కు ముందు వన్‌ప్లస్ 11 డిజైన్, ఫీచర్లు సహా పలు వివరాలను కంపెనీ నిర్ధారించింది.  మరో మోడల్ శాండ్‌స్టోన్ ఫినిష్‌తో ఆకట్టుకుంది. లేటెస్ట్ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ కలర్స్‌తో పాటు ఫస్ట్‌లుక్‌లో వన్‌ప్లస్ 11 స్మార్ట్‌ఫోన్ కెమెరా మాడ్యూల్ డిజైన్‌ను కూడా కంపెనీ రివీల్ చేసింది. అలర్ట్ స్లైడర్‌ను తిరిగి ప్రవేశపెడుతున్నట్టు ఫస్ట్‌లుక్‌లో వెల్లడైంది. సర్క్యులర్ కెమెరా మాడ్యూల్‌తో పాటు ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన మూడు సెన్సర్లతో వన్‌ప్లస్ 11 కస్టమర్ల ముందుకు రానుంది. టాప్ క్లాస్ కెమరా పెర్ఫామెన్స్‌ను అందించేందుకు హ్యాసిల్‌బ్లాద్‌తో చేతులు కలిపినట్టు కంపెనీ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక వన్‌ప్లస్ 11 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 48 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 32 ఎంపీ టెలిఫొటో లెన్స్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఫస్ట్‌లుక్‌లో సైడ్ కర్వ్స్‌తో స్లీక్ డిజైన్‌తో వన్‌ప్లస్ 11 స్టైలిష్ లుక్‌లో కనిపించింది.

Post a Comment

0 Comments

Close Menu