Ad Code

యూట్యూబ్ వల్ల రూ.10 వేల కోట్ల ఆదాయం !

YouTube, యూట్యూబ్ వీడియోలతో ఆదాయం పొందడం ఎలా? - how to make money on youtube:  ads, sponsors and off-site - Samayam Telugu

యావత్ ప్రపంచ ప్రజల మనస్సులు చూరగొన్న యూట్యూబ్ వల్ల 2021లో భారత ఆర్థిక వ్యవస్థకు, దేశ జీడీపీలో రూ.10 వేల కోట్ల నిధులు సమకూర్చి పెట్టింది. ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్ నిర్వహించిన ఈ సంగతి తేలింది. 7.50 లక్షలకి పైగా సమానమైన పూర్తిస్థాయి ఉద్యోగాలు లభించాయని ఈ సర్వేలో నిర్ధారించారు. అంతకుముందు 2020లో గూగుల్ సారధ్యంలోని యూట్యూబ్ వల్ల భారత్ జీడీపీలో రూ.6,800 కోట్ల నిధులు సమకూరితే, 6,83,900 పూర్తికాల ఉద్యోగాలు లభించాయని తేలింది. గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్‌లో ఆక్స్‌ఫర్డ్ ఎకనమిక్స్ సర్వే నివేదికను సోమవారం ప్రవేశ పెట్టారు. వివిధ రంగాల్లో 5633 మంది యూట్యూబ్ క్రియేటర్లను ఆక్స్‌ఫర్డ్ ఎకనమిక్స్ సర్వేక్షకులు సంప్రదించారు. 4021 మంది యూజర్లు, 523 మంది వ్యాపారవేత్తలను సంప్రదించారు. భారత్‌లో ఎకానమీ సృష్టికర్తగా యూట్యూబ్ నిలిచినందుకు మేం సంతోషిస్తున్నాం. దేశవ్యాప్తంగా కొత్త కొలువులు, అవకాశాలు కల్పిస్తున్నది యూట్యూబ్‌` అని యూట్యూబ్ సౌత్, సౌత్ ఏషియా, ఏపీఏసీ ఎమర్జింగ్ మార్కెట్స్ డైరెక్టర్ అజయ్ విద్యాసాగర్ చెప్పారు. యూట్యూబ్, గూగుల్ యూజర్లకు మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్‌), కృత్రిమ మేధస్సు (ఏఎల్‌)లతో కొత్త అవకాశాలు ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించాయి. తమ ప్లాట్‌ఫామ్‌పై హెల్త్‌కేర్ కంటెంట్‌, లెర్నింగ్ కంటెంట్ విస్తరణకు రెండు కొత్త ఫీచర్లు ప్రవేశపెడుతున్నట్లు యూట్యూబ్ తెలిపింది. నారాయణ, మణిపాల్‌, మేదాంత వంటి పలు హెల్త్‌కేర్ సంస్థలు అత్యంత విశ్వసనీయమైన కంటెంట్ ప్రజలకు అందిస్తున్నాయి. హిందీ, మరాఠీ, తమిళం, తెలుగు, కన్నడ, గుజరాతీ, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో కంటెంట్ అందుబాటులో్కి వస్తున్నది. ప్రపంచదేశాలతో పోలిస్తే భారత్‌లో ప్రతి నెలా గూగుల్ లెన్స్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. అంతర్జాతీయ యూజర్లతో పోలిస్తే రోజువారీగా వాయిస్.. భారతీయులు రెట్టింపు ఎంక్వైరీ చేస్తున్నారని తేలింది. వారిలో మెజారిటీ యూజర్లు ఒకటి కంటే ఎక్కువ భాషల్లో కంటెంట్ తెలుసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu