Ad Code

టైప్‌-2 మధుమేహాన్ని అంచనా వేసే ఐఏ నమూనా !


మధుమేహం ఏ రకమైనా మనల్ని ఇబ్బందిపెట్టేవే. ముందుస్తుగా గుర్తించే అవకాశాల్లేవు. అయితే, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారంగా ముందస్తుగా కనిపెట్టేందుకు వీలుగా ఉండే ఓ నమూనాను పరిశోధకులు అభివృద్ధి చేశారు. టైప్ 2 డయాబెటిస్.. సాధారణ ఆరోగ్య పరిస్థితి. శరీరం ఇన్సులిన్‌ను సమర్ధంగా ఉపయోగించుకోకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. దీని వలన రక్తంలో చక్కెర లేదా గ్లూకోజ్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి. అధిక దాహం, ఎక్కువగా మూత్ర విసర్జన చేయడం, విపరీతమైన అలసట వంటి లక్షణాలకు దారితీస్తుంది. మధుమేహం ఒక వ్యక్తిలో కళ్ళు, గుండె, నరాలకు సంబంధించిన తీవ్రమైన, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెట్టే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. టైప్‌-2 డయాబెటిస్‌ను 12 గంటల్లో అంచనా వేయడం సాధారంగా సాధ్యం కాదు. అయితే, పరిశోధకులు కృత్రిమ మేధస్సుతో పనిచేసే ఓ మోడల్‌ను అభివృద్ధి చేశారు. ఈ మోడల్‌ టైప్-2 డయాబెటిస్‌ను 12 గంటల వ్యవధిలో అంచనా వేయడంలో సాయపడనున్నది. ప్రీడయాబెటిస్, డయాబెటిస్‌ను ఖచ్చితంగా నిర్ధారించడానికి నిరంతర గ్లూకోజ్ మానిటర్ల (సీజీఎం) నుంచి రీడింగ్‌లను ఉపయోగించవచ్చా లేదా అని పరిశోధకులు పరిశోధించారు. కేవలం 12 గంటల గ్లూకోజ్ ప్రొఫైల్ డాటాలో టైప్-2 డయాబెటిస్, ప్రీడయాబెటిస్, బలహీనమైన గ్లూకోస్ టాలరెన్స్ లేని వ్యక్తులను తెలుసుకునే వీలుంటుందని పరిశోధకులు తెలిపారు. ఇది ఖచ్చితంగా పర్యవేక్షణ, ముందస్తు స్క్రీనింగ్‌లో ఉపయోగపడదు. అయితే, మధుమేహం వచ్చే ప్రమాదం గురించి రోగిని హెచ్చరిస్తుందని క్లిక్ అప్లైడ్ సైన్సెస్‌లోని ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్, ప్రధాన రచయిత జౌహ్యూన్ క్లేర్ జియోన్ పేర్కొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu