Ad Code

నోకియా సీ31 స్మార్ట్‌ఫోన్ విడుదల


నోకియా ఇండియా రూ.10,000 లోపు బడ్జెట్‌లో నోకియా సీ31 స్మార్ట్‌ఫోన్ విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో భారీ డిస్‌ప్లే, 3 రోజుల బ్యాటరీ లైఫ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.9,999. రెండు వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ లభిస్తుంది. 3జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999 కాగా, 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999. నోకియా సీ31 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.7 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే ఉంది. ఒక ఏడాది రీప్లేస్‌మెంట్ గ్యారెంటీ ఆఫర్ చేస్తోంది నోకియా ఇండియా. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. రెండేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ లభిస్తాయి. నోకియా సీ31 స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. 3జీబీ+32జీబీ, 4జీబీ+64జీబీ వేరియంట్లలో లభిస్తుంది. మెమొరీ కార్డుతో 256జీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఇందులో 5050ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. మూడు రోజుల బ్యాటరీ లైఫ్ లభిస్తుంది. అంటే ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేసి మూడు రోజుల పాటు ఉపయోగించుకోవచ్చు. 10వాట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, బ్లూటూత్ 4.2, వైఫై లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. నోకియా సీ31 స్మార్ట్‌ఫోన్‌ను నోకియా అధికారిక వెబ్‌సైట్ లేదా రీటైల్ ఔట్‌లెట్స్‌లో కొనొచ్చు. ఇ-కామర్స్ వెబ్‌సైట్లలో కూడా కొనొచ్చు. చార్‌కోల్, మింట్, సియాన్ కలర్స్‌లో కొనొచ్చు.

Post a Comment

0 Comments

Close Menu