Ad Code

అమ్మకానికి డార్క్ వెబ్‌లో 3 కోట్ల మంది ప్రయాణీకుల పేరు, ఫోన్ నంబర్లు ?

 

భారతీయ రైల్వే వినియోగదారుల డేటా ఆన్‌లైన్‌లో లీక్ అయినట్లు సమాచారం. డార్క్ వెబ్ ద్వారా ఒక హ్యాకర్ డేటాను అమ్మకానికి పెట్టినట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి. అత్యున్నత వైద్య సంస్థ - ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ పై డేటా ఉల్లంఘన జరిగిన కొద్ది రోజులకే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు, ప్రభుత్వం లేదా భారతీయ రైల్వేలు డేటా ఉల్లంఘన గురించి ఏమీ ధృవీకరించలేదు. ఇందులో నిజమెంత అనేది క్లారిటీ లేదు. అందులోనూ హ్యాకర్ అందించిన డేటా కచ్చితమైనదో లేదో తెలియదు Times Now నుంచి వచ్చిన నివేదిక ప్రకారం.. హ్యాకర్లు ఈ-మెయిల్, మొబైల్ నంబర్, అడ్రస్, వయస్సు, లింగంతో సహా చాలా యూజర్ డేటాను పొందారని తెలిసింది. భారతీయ రైల్వే ప్రయాణికుల ట్రావెల్ హిస్టరీ, ఇన్‌వాయిస్‌లను కూడా గ్రూప్ లీక్ చేసిందని ఆ హ్యాకర్ పేర్కొన్నాడు. లీక్ అయిన డేటాలో యూజర్ డేటాతో పాటు యూజర్ల బుకింగ్ డేటా కూడా ఉందని తెలిసింది. ఫోరమ్ డేటా కాపీకి 400 డాలర్లు వసూలు చేస్తోంది. కొనుగోలుదారు కేవలం 5 కాపీలను మాత్రమే పొందగలరు. మరో నివేదిక ప్రకారం.. డేటాకు ప్రత్యేకమైన యాక్సెస్ కావాలనుకునే వారు డేటా, ఇతర వివరాల కోసం 1,500 డాలర్లు నుంచి 2000 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. డేటా ఉల్లంఘన డిసెంబర్ 27న జరిగినట్లు తెలిసింది. డేటా లీక్ గురించిన వివరాలను హ్యాకర్ ఫోరమ్‌లో పోస్ట్ చేశారు. అసలు వారు ఎవరు అనేది మాత్రం అసలు గుర్తింపు ఇంకా తెలియదు. దీనిని ‘షాడో హ్యాకర్’ అనే వ్యక్తి పోస్ట్ చేశారు. అదో ఫేక్ నేమ్. ప్రభుత్వ శాఖల్లోని పలువురి అధికారిక ఈ-మెయిల్ అకౌంట్లను కూడా యాక్సస్ చేసినట్టు అదే హ్యాకర్ గ్రూప్ చెబుతోంది. ప్రస్తుతానికి, హ్యాకర్ గ్రూప్ IRCTC డేటాను ఎలా యాక్సెస్ చేయగలదో సమాచారం లేదు. లేటెస్ట్ డేటా ఉల్లంఘన అథెంటికేషన్ సైబర్‌ సెక్యూరిటీ సంస్థలు సైతం ఇంకా ధృవీకరించలేదు.

Post a Comment

0 Comments

Close Menu