Ad Code

టెక్నో పోవా 4 స్మార్ట్‌ఫోన్‌ విడుదల


దేశీయ మార్కెట్ లో మీడియం సెగ్మెంట్‌ ఫోన్‌లకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. ఈ రేంజ్‌ ఫోన్‌ సేల్స్‌ ఎక్కువగా ఉంటాయి. అందుకు చాలా కంపెనీలు మీడియం రేంజ్‌లో బెస్ట్‌ ఫీచర్లు అందించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ టెక్నోబడ్జెట్ ధరలోనే ప్రీమియం ఫోన్‌లు లాంచ్ చేస్తూ తన మార్కెట్‌ను విస్తరిస్తోంది. టెక్నో తాజాగా పోవా 4ను ఇండియన్‌ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్ 6nm Helio G99 SoC ప్రాసెసర్‌పై పని చేస్తుంది. హైపర్-ఇంజిన్ 2.0 లైట్, పాంథర్ ఇంజిన్‌ను కలిగి ఉన్న ఇన్-బిల్ట్ డ్యూయల్ గేమింగ్ ఇంజిన్‌తో వస్తుంది.  టెక్నో పోవా 4 ఫీచర్ల విషయానికి వస్తే.. ఇది 90Hz రిఫ్రెషర్ రేట్‌తో కూడిన 6.82-అంగుళాల HD+ డాట్-ఇన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 6nm MediaTek Helio G99 SoC ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఇది పాంథర్ గేమ్ ఇంజిన్ 2.0, హైపర్‌ఇంజిన్ 2.0 లైట్‌తో కూడిన ఇన్-బిల్ట్ గేమింగ్ ఇంజిన్‌తో వస్తుంది. మెమరీ ఫ్యూజన్ టెక్నాలజీతో పాటు 13 GB ర్యామ్‌తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 128GB uMCP ఇంటర్నల్ మెమరీతో పాటు 2TB ఎక్స్టెండబుల్ స్టోరేజ్‌తో వస్తుంది. కెమెరా పరంగా చూస్తే.. 50MP డ్యూయల్ రియర్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంటుంది. వీడియో కాలింగ్, సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ సెన్సార్‌ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 12 ఆధారిత HiOS 12.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడుస్తుంది. దీనిలో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ గల 6,000mAh బ్యాటరీ ఉంటుంది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 10 గంటల పాటు నాన్‌స్టాప్ మ్యూజిక్, ప్లేబ్యాక్ లేదా కాల్‌ను పొందవచ్చు.


Post a Comment

0 Comments

Close Menu