Ad Code

మోటో ఈ40 స్మార్ట్‌ ఫోన్‌ మీద భారీ ఆఫర్‌ !


మోటోరోలా అక్టోబర్‌ నెలలోనే లాంచ్‌ చేసిన మోటో ఈ40 స్మార్ట్‌ ఫోన్‌ మీద భారీ ఆఫర్‌ ప్రకటించింది. 599కే ఈ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది. 90 HZ రిఫ్రెష్‌ రేట్‌ డిస్‌ప్లే, ట్రిపుల్‌ రియర్‌ కెమరా సెటప్‌, 5000 mAH బ్యాటరీతో ఈ ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. విడుదల సమయంలో ఈ ఫోన్‌ ధర 9, 499 రూపాయలు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మోబైల్‌ 8,599 రూపాయలకు అందుబాటులో ఉంది. అయితే ఈ ఫోన్‌ని కేవలం 599 రూపాయలకే ఫ్లిప్‌కార్ట్‌లో సొంత చేసుకోవచ్చని మోటోరోలా ప్రకటించింది. సుమారు 9 వేల రూపాయల ధర ఉన్న ఈ ఫోన్‌ని 599 రూపాయలకే పొందాలంటే మీ పాత ఫోన్‌ని ఎక్స్చేంజ్ చేయాలి. 8 వేల రూపాయల వరకు మోటోరోలా ఎక్స్చేంజ్ ఆఫర్‌ ఇస్తోంది. ఈ క్రమంలో పాత ఫోన్‌ని ఎక్స్చేంజ్ చేస్తే.. 8 వేల రూపాయలు వస్తే.. ఇక మీరు కేవలం రూ.599కే ఈ ఫోన్‌ని సొంత చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్‌తో సంబంధం లేకుండా ఇప్పటికే ప్లిప్‌కార్ట్‌ మోటో ఈ40 మీద 2,400 రూపాయల డిస్కౌంట్‌ ఇస్తుంది. అంతేకాక ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డ్‌ ద్వారా కొనుగోలు చేస్తే. మరో 5 శాతం క్యాష్‌బ్యాక్‌ అదనంగా లభిస్తుంది.


Post a Comment

0 Comments

Close Menu