Ad Code

విమానాల్లోనూ 5G ఇంటర్నెట్ ద్వారా ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు ?


విమానాల్లో ప్రయాణించే ప్రయాణీకులు తమ స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను ఉపయోగించుకోవచ్చు. అదనంగా, విమానయాన సంస్థలు మొబైల్ డేటాకు యాక్సెస్‌తో పాటు ప్రయాణీకుల కోసం విమానాలలో 5G మొబైల్ కనెక్టివిటీని కూడా అందించనున్నాయి. నివేదిక ప్రకారం.. గాలిలో మొబైల్ కనెక్టివిటీకి సంబంధించిన ఆదేశాలను ఈయూ తోసిపుచ్చింది. యూనియన్ ప్రజల కోసం వినూత్న సేవలను ప్రారంభించాలని యోచిస్తోంది. యూరప్ ఖండంలో ప్రయాణించే ప్రయాణీకుల కోసం విమానాలలో మొబైల్ నెట్‌వర్క్ కనెక్టివిటీని అందించేందుకు సన్నద్ధమవుతోంది. జూన్ 30, 2023 నాటికి విమానాలలో 5G ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లను అందుబాటులోకి తీసుకురానున్నాయి. కొత్త ఆదేశాలను అమలు చేయాలని యూరోపియన్ యూనియన్ తన సభ్య దేశాలను ఆదేశించింది. ఒకసారి అమలులోకి వచ్చిన తర్వాత, విమాన ప్రయాణికులు తమ స్మార్ట్‌ఫోన్‌లను మిడ్-ఫ్లైట్ కాలింగ్, వెబ్-సర్ఫింగ్, నెట్‌లో స్ట్రీమింగ్, ఇంటర్నెట్ కనెక్టివిటీ యాప్‌ల ద్వారా పూర్తి స్థాయిలో వినియోగించుకోనున్నారు. ఇందులో భాగంగా, ఈయూ తన డిజిటల్ ఫ్యూచర్ స్ట్రాటజీ కింద మిడ్-ఫ్లైట్ కనెక్టివిటీ కొత్త ఆర్డర్‌లను తీసుకువస్తోంది. ఈయూ ఆదేశాలతో అన్ని యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలను ప్రభావితం చేస్తాయి. ఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, క్రొయేషియా, రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఎస్టోనియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, హంగరీ, ఐర్లాండ్, ఇటలీ, లాట్వియా, లిథువేనియా, లక్సెంబర్గ్, మాల్టా, నెదర్లాండ్స్, పోలాండ్, పోర్చుగల్, రొమేనియా, స్లోవేకియా, స్లోవేనియా, స్పెయిన్, స్వీడన్ వంటి దేశాలు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణీకులకు Wi-Fi కనెక్టివిటీని అందించే కొన్ని విమానయాన సంస్థలు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్నెట్ సర్వీసులు చాలా నెమ్మదిగా ఉండటంతో వందలాది మంది ప్రయాణికులతో 3 MHz స్పీడ్ అందిస్తుంది. యూజర్లు తమ ఇంటి Wi-Fiతో 20 నుంచి160 MHzని పొందవచ్చు. అదే విమానంలో భూమి మధ్య ఉపగ్రహం ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్‌ను అందించే డివైజ్‌లలో కనెక్టివిటీ పూర్తిగా అందించవచ్చు. యూరోపియన్ యూనియన్  ద్వారా కొత్త 5G సిస్టమ్ 100 Mbps కన్నా ఎక్కువ ఆఫర్ చేస్తుందని చెప్పవచ్చు. విమాన ప్రయాణికులు మూవీలను చూసేందుకు వీడియోలను అధిక వేగంతో డౌన్‌లోడ్ చేసేందుకు అనుమతిస్తుంది. అదే సమయంలో, విమాన వ్యవస్థకు అంతరాయం కలిగించే 5G బ్యాండ్‌లపై EU ఆందోళనను కూడా పరిష్కరించింది. యూకే ఫ్లైట్ సేఫ్టీ కమిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డై విట్టింగ్‌హామ్ ప్రకారం.. 5G కోసం భిన్నమైన ఫ్రీక్వెన్సీలు ఉన్నాయి. అమెరికాలో అనుమతించిన వాటి కన్నా తక్కువ పవర్ సెట్టింగ్‌లు ఉన్నాయి. విమానాల్లో ప్రయాణించే వారంతా 5Gని కోరుకుంటారు. ఏమి చేసినా సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకుంటారని చెప్పారు.

Post a Comment

0 Comments

Close Menu