Ad Code

గూగుల్ 8వ ఎడిషన్ ఈవెంట్


ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో సోమవారం గూగుల్ 8వ ఎడిషన్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో అనేక కీలక ప్రకటనలు చేసింది. అందులో ప్రధానంగా గూగుల్ ఆండ్రాయిడ్ ఫైల్స్ యాప్ లో DigiLocker ఇంటిగ్రేషన్ నుంచి Google Pay కొత్త 'New Transaction' ఫీచర్ వరకు అనేక విధానాలను ప్రకటించింది. ఈ సందర్భంగా కార్యక్రమంలో గూగుల్ ఫర్ ఇండియా 2022 ఈవెంట్లో పాల్గొనేందుకు కంపెనీ సీఈవో సుందర్‌ పిచాయ్‌ భారత్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గూగుల్ సర్వీసుల్లో ఒకటైన Google Pay డిజిటల్ యాప్ ద్వారా UPI సర్వీసులను అందిస్తున్నట్టు తెలిపారు. అయితే, ఇప్పుడు ఈ UPI సర్వీసులను ప్రపంచంలోని ఇతర దేశాలకు విస్తరించనున్నట్టు సుందర్ పిచాయ్ ప్రకటించారు. అంతేకాదు.. వేలాది భాషల్లో సమాచారాన్ని పొందగల శక్తివంతమైన AI మోడల్‌పై గూగుల్ పని చేస్తుందని కూడా ఆయన చెప్పారు. అదే సమయంలో, కమ్యూనికేషన్ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. AI గణనీయమైన మార్పులను తీసుకురాబోతున్న అనేక రంగాలు ఉన్నాయని తెలిపారు.  ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారుల కోసం గూగుల్ డిజిలాకర్ ఇంటిగ్రేషన్ ఫీచర్‌ను ప్రకటించింది. ఆండ్రాయిడ్ యూజర్లు Google Files యాప్ ద్వారా DigiLockerని కూడా యాక్సస్ చేసుకోవచ్చు. డిజిలాకర్ అనేది వర్చువల్ లాకర్. ఇందులో ముఖ్యమైన డాక్యుమెంట్లన్నింటినీ పేపర్‌లెస్ ఫార్మాట్‌లో డిజిటల్‌గా భద్రపరుచుకోవచ్చు.  గూగుల్ పేమెంట్ సర్వీసుల్లో Google Pay నుంచి కొత్త 'New Transaction' ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ ఫీచర్ సాయంతో వినియోగదారులు తమ లావాదేవీల గురించి వాయిస్ ద్వారా తెలుసుకోవచ్చు. Google Pay ఇప్పుడు అనుమానాస్పద లావాదేవీల కోసం మరిన్ని భద్రతా హెచ్చరికలను పంపనుంది. ఇందుకోసం గూగుల్ ML అల్గారిథమ్‌లను ఉపయోగిస్తుంది. ఈ హెచ్చరిక గూగుల్ పే యూజర్ల ప్రాంతీయ భాషలో కూడా అందుబాటులో ఉండనుంది. గూగుల్ సెర్చ్ ఫెసిలిటీ ఇన్ సైడ్ వీడియో అనే కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా వీడియోలో ఏదైనా విషయాన్ని సెర్చ్ చేయవచ్చు. అంటే.. మీరు 'Search in video feature' ద్వారా మీ ప్రశ్నను టైప్ చేస్తే చాలు.. మీరు వీడియోలోసెర్చ్ చేస్తున్న కచ్చితమైన ప్రదేశానికి వెళ్లవచ్చు. ఇంతకు ముందు వీడియోలో ఏదైనా సెర్చ్ చేసేందుకు Seek Option మాత్రమే ఉండేది. 'Search in Video' ఫీచర్ సాయంతో సెర్చ్‌ చేసే విధానం మరింత సులభతరం కానుంది. యూట్యూబ్ సర్వీసులో కొత్త 'కోర్సులు' అనే సదుపాయాన్ని ప్రవేశపెట్టనుంది. ముఖ్యంగా కంటెంట్ క్రియేటర్లు యూట్యూబ్ ద్వారా అనేక విషయాలను నేర్చుకోవడానికి వీలు కల్పిస్తుంది. వీక్షకులకు నిర్మాణాత్మక అభ్యాస అనుభవాన్ని అందించడానికి క్రియేటర్లు ఉచితంగా లేదా పేమెంట్ కోర్సులను అందించవచ్చు. ఈ కోర్సులను కొనుగోలు చేయడానికి ఎంచుకున్న వీక్షకులు యాడ్స్ లేకుండా వీడియోలను చూడవచ్చు. అంతేకాదు.. యూట్యూబ్ క్రియేటర్లు ఇప్పుడు కంటెంట్‌ను ఉచితంగా డబ్ చేయవచ్చు. కొత్త AI, ML ప్రొడక్టు ద్వారా అదనపు ఖర్చు లేకుండా అసలు కంటెంట్‌ను ఈజీగా డబ్ చేయవచ్చు. హెల్త్ ఆధారిత క్రియేటర్లు, భాగస్వాములను ఎంపిక చేసేందుకు రూపొందించారు. యూట్యూబ్ వీక్షకులు ఈ వీడియోలను వేరే ఆడియో ట్రాక్‌కి టోగుల్ చేయవచ్చు. భారత్‌లో ఇప్పటివరకూ గూగుల్ సెర్చ్ పేజీలో ఇంగ్లీష్ ప్రధాన భాషగా ఉంది. అయితే భారతీయ భాషల్లో హిందీ సెర్చ్ రిజల్ట్స్‌లో సపోర్టు చేస్తుంది. ఇకపై గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ పేజీలలో భారత్ ద్విభాషగా మారుతుంది. ఈ Bilinguals ఫీచర్ ద్వారా రాబోయే రోజుల్లో తమిళం, తెలుగు, మరాఠీ, బెంగాలీ భాషలను కూడా సపోర్ట్ చేస్తుంది. వాయిస్ సెర్చ్ ఫీచర్ ఇప్పుడు హింగ్లీష్ మాట్లాడే వ్యక్తులను బాగా అర్థం చేసుకోవచ్చు. కొత్త న్యూరల్ నెట్‌వర్క్ మోడల్ ద్వారా పనిచేస్తుంది. భారతీయ యూజర్ల భాషల్లో వారి మాట్లాడే భాషలో యాస, సందర్భం, మరిన్నింటిని పరిగణనలోకి తీసుకుని గూగుల్ వారికి అర్థమయ్యే రీతిలో సెర్చ్ రిజల్ట్స్ చూపించనుంది.

Post a Comment

0 Comments

Close Menu