Ad Code

మనిషి మెదడులో న్యూరాలింక్ చిప్ ?


ఎలన్ మస్క్‌కు చెందిన 'న్యూరాలింక్' సంస్థ త్వరలో మనిషి మెదడులో న్యూరాలింక్ చిప్‌ను ప్రవేశపెట్టబోతుంది. ప్రయోగాత్మకంగా చేపట్టనున్న ఈ ప్రయత్నం విజయవంతమైతే ఇకపై మనిషి తన మెదడుతోనే కంప్యూటర్, మొబైల్ ఫోన్ వంటి డివైజ్‌లను ఆపరేట్ చేయొచ్చు. ఈ ప్రయోగాన్ని రాబోయే ఆరు నెలల్లో చేపడతామని ఎలన్ మస్క్ ప్రకటించాడు. ఈ ప్రయోగం చేపట్టేందుకు ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురు చూస్తున్నట్లు వెల్లడించాడు. ఎలన్ మస్క్ స్థాపించిన స్టార్టప్ 'న్యూరాలింక్'. ఇది వైర్‌లెస్ బ్రెయిన్ కంట్రోల్ టెక్నాలజీ సంస్థ. మెదడును కంట్రోల్ చేయగలిగే టెక్నాలజీని, చిప్స్‪ను ఈ సంస్థ తయారు చేస్తోంది. ఆరేళ్లక్రితమే రోబోలో ఈ చిప్ ప్రవేశపెట్టి, దీన్ని ప్రదర్శించారు. అప్పటి నుంచి చాలా డెవలప్ చేశారు. తర్వాత జంతువుల్లో ఈ చిప్ ప్రవేశపెట్టారు. కొంతకాలం క్రితం ఒక కోతి జాయ్ స్టిక్ లేకుండానే కంప్యూటర్లో వీడియో గేమ్ ఆడుతున్న వీడియో ఒకటి రిలీజ్ చేసింది. ఈ చిప్ మనుషుల మెదడులో కూడా విజయవంతంగా పని చేస్తే ఎలాంటి మౌస్, కీబోర్డ్ వంటివి వాడకుండానే కంప్యూటర్ లాంటి పలు స్మార్ట్ డివైజ్‌లను ఆపరేట్ చేయొచ్చు. ప్రజల జీవితాల్ని సులభతరం చేసేందుకే ఇలాంటి వాటిని రూపొందిస్తున్నట్లు 'న్యూరాలింక్' ప్రకటించింది. కాగా, వీడియోలో కనిపించిన కోతి గత ఫిబ్రవరిలో మరణించింది. దీంతో ఈ సంస్థపై పలు విమర్శలు తలెత్తాయి. జంతువుల్ని ప్రయోగాల పేరుతో న్యూరాలింక్ సంస్థ హింసకు గురి చేస్తోందని పలువురు విమర్శించారు.

Post a Comment

0 Comments

Close Menu