Ad Code

ఎల్టన్ జాన్ ట్విట్టర్‌ కు గుడ్ బై !


మ్యూజిక్ కంపోజర్ ఎల్టన్ జాన్ ట్విట్టర్‌ను వీడారు. ట్విట్టర్ ద్వారా తప్పుడు సమాచారం ఎక్కువగా వ్యాప్తి అవుతోందని, అందుకే ఆ ఫ్లాట్‌ఫామ్‌ను వాడడం లేదని ఎల్టన్ జాన్ తెలిపారు. మ్యూజిక్ ద్వారా ప్రజల్ని కలిపేందుకు జీవితం అంతా ప్రయత్నించానని, కానీ ప్రస్తుతం తప్పుడు సమాచారం వల్ల ప్రపంచం విభజనకు గురవుతుందని ఎల్టన్ తన ట్వీట్‌లో ఆరోపించారు. ట్విట్టర్ తాజాగా మార్చిన విధానాల వల్ల తప్పుడు సమాచారం వ్యాప్తి అవుతోందని, అందుకే ఆ సైట్‌కు దూరంగా ఉండనున్నట్లు ఎల్టన్ వెల్లడించారు. ట్విట్టర్ ఓనర్ ఎలన్ మస్క్ స్పందిస్తూ స్వరకర్త ఎల్టన్ త్వరలోనే మళ్లీ ట్విట్టర్‌లో చేరుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Post a Comment

0 Comments

Close Menu