Ad Code

గూగుల్‌ వాయిస్‌ లేటెస్ట్‌ అప్‌డేట్‌


ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లు, ఈమెయిల్స్‌ ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారు. చాలా మంది మోసగాళ్లు మాటలు నమ్మి డబ్బులు నష్టపోతున్నారు.తాజాగా స్పామ్‌ కాల్స్‌కు చెక్‌ పెట్టేందుకు గూగుల్‌ ఓ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. టెక్‌ దిగ్గజం గూగుల్ కంపెనీ రీసెంట్‌గా గూగుల్‌ వాయిస్‌ ఫీచర్‌ని అప్‌డేట్‌ చేసింది. దీనికి వార్నింగ్‌ ఫీచర్‌ని యాడ్‌ చేసింది. ఇది ఇన్‌కమింగ్ స్పామ్ కాల్‌ల గురించి వినియోగదారులను అప్రమత్తం చేస్తుంది. గూగుల్‌ లేటెస్ట్‌ వార్నింగ్‌ ఫీచర్‌ వినియోగదారులు అన్‌వాంటెడ్‌ కాల్స్‌ను నివారించడంలో సహాయపడుతుంది. హానికరమైన స్కామ్‌ల బారిన పడకుండా రక్షణ కల్పిస్తుంది. స్పామ్ కాలర్‌లను గుర్తించడానికి గూగుల్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఉపయోగిస్తుంది. గూగుల్‌ వాయిస్‌ ఫీచర్‌ అమెరికా లోని గూగుల్‌ అకౌంట్‌ కస్టమర్‌లకు, కెనడాలోని గూగుల్‌ వర్క్‌స్పేస్‌ కస్టమర్‌లకు అందుబాటులో ఉంది. దీని ద్వారా వినియోగదారులు కాల్ చేయవచ్చు, టెక్స్ట్‌ మెసేజ్‌, వాయిస్‌ మెయిల్‌ పంపవచ్చు. ఈ ఫీచర్‌ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు కంప్యూటర్‌లలో కూడా పనిచేస్తుంది. వర్క్‌స్పేస్ బ్లాగ్ అప్‌డేట్‌లో కొత్త ఫీచర్‌ గురించి గూగుల్ ప్రకటించింది. అన్‌వాంటెడ్‌ కాల్స్‌, పొటెన్షియల్లీ హార్మ్‌ఫుల్‌ స్కామ్‌ల నుంచి వినియోగదారులను రక్షించడానికి, గూగుల్‌ వాయిస్‌ 'సస్పెక్టెడ్‌ స్పామ్‌ కాలర్‌' అనే లేబుల్‌ను చూపుతుంది. గూగుల్ కాలింగ్ ఎకోసిస్టమ్‌లో ప్రతి నెలా బిలియన్ల కొద్దీ స్పామ్ కాల్‌లను గుర్తించే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా స్పామ్‌ అలర్ట్‌ పని చేస్తుందని కంపెనీ పేర్కొంది. కొత్త స్పామ్ కాల్స్ లేబుల్ ఇన్‌కమింగ్ కాల్ స్క్రీన్‌తో పాటు కాల్ హిస్టరీలో కనిపిస్తుందని గూగుల్ తెలిపింది. వినియోగదారులకు ఇక్కడ రెండు ఆప్షన్‌లు ఉంటాయి. మొదటి ఆప్షన్‌లో.. వినియోగదారులు స్పామ్ కాల్‌ను నిర్ధారించగలరు. దీంతో భవిష్యత్తులో ఆ నంబర్ నుంచి వచ్చే కాల్స్‌ నేరుగా వాయిస్‌మెయిల్‌కి వెళ్లి కాల్ హిస్టరీ ఎంట్రీలను స్పామ్ ఫోల్డర్‌లో ఉంచుతాయి. రెండో ఆప్షన్‌లో లేబుల్ చేసిన కాల్‌ని స్పామ్ కాదని గుర్తించవచ్చు. ఆ తర్వాత ఆ నంబర్‌ నుంచి కాల్‌ వస్తే సస్పెక్టెడ్‌ స్పామ్ లేబుల్ మళ్లీ కనిపించదు. ఈ ఫీచర్ దశలవారీగా రోల్ అవుట్ అవుతుంది. ఇది ఇప్పటికే డిసెంబర్ 29 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ గూగుల్ వాయిస్ కస్టమర్‌లందరికీ అందుబాటులో ఉంది. అలాగే వాయిస్ స్పామ్ ఫిల్టర్ ఆఫ్‌లో ఉంటే సస్పెక్టెడ్‌ స్పామ్ లేబులింగ్ స్క్రీన్‌పై ఆటోమేటిక్‌గా కనిపిస్తుంది. సస్పెక్టెడ్‌ స్పామ్ కాల్‌ని ఆటోమేటిక్‌గా వాయిస్‌మెయిల్‌కి పంపడానికి..సెట్టింగ్స్‌> సెక్యూరిటీ > ఫిల్టర్ స్పామ్ > టర్న్‌ ఇట్‌ ఆన్‌ స్టెప్స్‌ ఫాలో కావాలి. స్పామ్ ఫిల్టరింగ్ ఆన్‌లో ఉన్నప్పుడు, గూగుల్‌ స్పామ్‌గా గుర్తించే అన్ని కాల్స్‌ ఆటోమేటిక్‌గా వాయిస్‌మెయిల్‌కి వెళ్తాయి. కాల్ ఎంట్రీ స్పామ్ ఫోల్డర్‌లో ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu