Ad Code

వాట్సాప్‌ చాట్ లిస్టులో అన్ రీడ్ మెసేజ్‌లను ఫిల్టర్ చేసే విధానం !


వాట్సాప్‌ చాట్ లిస్ట్‌లో Unread మెసేజ్‌లను ఫిల్టర్ చేసే ఫీచర్ కూడా తీసుకొస్తోంది. చదవని అన్ని చాట్‌లను త్వరగా వీక్షించేందుకు యూజర్లకు అనుమతిస్తుంది. 

ఆపిల్ ఐఫోన్ : iPhoneలో WhatsApp ఓపెన్ చేయండి. సెర్చ్ బార్‌ను బహిర్గతం చేసేందుకు చాట్ లిస్ట్‌లో పైకి స్క్రోల్ చేయండి, ఆపై, సెర్చ్ బార్‌లో కుడి వైపున ఉంచిన ఫైలర్ ఐకాన్‌పై Tap చేయండి. ఐకాన్ ఆఫ్ చేసేందుకు దాన్ని మళ్లీ Tap చేయండి.

ఆండ్రాయిడ్ : WhatsApp ఓపెన్ చేయండి. Search Boxని Tap చేయండి. ఆపై ఫోటోలు, వీడియోలు, లింక్‌లు, GIFలు, మరిన్ని వంటి ఆప్షన్లతో Unread మెసేజ్‌లపై Tap చేయండి. ఫిల్టర్‌ను ఆఫ్ చేసేందుకు X లేదా బ్యాక్‌స్పేస్‌ను Tap చేయండి.

వెబ్‌  : WhatsApp ఓపెన్ చేయండి. earch Boxకి కుడి వైపున ఉన్న ఫిల్టర్ iconపై Click చేయండి. ఫిల్టర్‌ను ఆఫ్ చేసేందుకు icon మళ్లీ Click చేయండి.

WhatsApp కొంతమంది యూజర్లు తమ అకౌంట్‌ను ఒకటి కన్నా ఎక్కువ డివైజ్‌లలో ఉపయోగించడానికి అనుమతిస్తుంది. BGR నివేదిక ప్రకారం, ఇన్‌స్టంట్ మెసేజ్ ప్లాట్‌ఫారమ్ బీటా టెస్టర్‌లు వారి WhatsApp అకౌంట్‌ను రెండవ డివైజ్‌తో అంటే టాబ్లెట్‌తో లింక్ చేసేందుకు అనుమతిస్తుంది. వాట్సాప్ ట్యాబ్లెట్ వెర్షన్‌తో తమ అకౌంట్ లింక్ చేయమని బీటా ఛానెల్‌లోని యూజర్లను వాట్సాప్ అలర్ట్ చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది.

Post a Comment

0 Comments

Close Menu