Ad Code

ఐఫోన్ యూజర్లకు ఈ యాప్స్ తో భూకంపం ఎలర్ట్స్


భూకంపం అనేది ప్రకృతి సృష్టించే విధ్వంసకర విపత్తు. ఈ విపత్తు ఎంత ప్రమాదకరంగా ఉంటుందంటే ప్రజలు ఆస్తులతో పాటు ప్రాణాలు కూడా కోల్పోతారు. తుఫాన్ హెచ్చరికలు వస్తుంటాయి కానీ ఎప్పుడు భూకంప హెచ్చరికలు రావు అని మనలో చాలా మందికి అనిపిస్తుంటుంది. అయితే మీరు ఐ ఫోన్ యూజర్లు అయితే మీకు భూకంప హెచ్చరికలు కూడా వస్తాయి. ఐ ఫోన్ యూజర్లు కొన్ని యాప్స్ ఇన్ స్టాల్ చేసుకుంటే ప్రపంచవ్యాప్తంగా భూకంపం ఎక్కడ వస్తుందని మనం మానిటర్ చేయవచ్చు. తద్వారా విదేశాల్లో ఉన్న మన బంధువులను కూడా అలర్ట్ చేసే అవకాశం ఉంది. ఈ యాప్స్ ఐ ఫోన్స్ లో పని చేయాలంటే కొన్ని సెట్టింగ్స్ ను మార్చాల్సి ఉంటుంది. ఐఓఎస్ లోని కొన్ని ఎమర్జెన్సీ ఫీచర్స్ ను యాక్సెప్ట్ చేస్తే ఈ యాప్స్ ఐ ఫోన్స్ లో పనిచేస్తాయి. ఐ ఫోన్స్ లో ఉపయోగపడే కొన్ని యాప్స్ ను ష్టార్ట్ లిస్ట్ చేశాం. ఈ యాప్స్ కచ్చితత్వంతో ఆకట్టుకోవడమే కాకుండా యూఎస్ జీఎస్ వంటి సంస్థలకు చెందిన డేటాను ఓపెన్ యాక్సెస్ చేయడంతో కచ్చితమైన సమాచారం వస్తుంది.

క్వేక్ ఫీడ్ : భూకంప హెచ్చరికలు, ట్రాకింగ్ కోసం ఐ ఫోన్ యూజర్లకు అందుబాటులో ఉన్న అద్భుతమైన యాప్ ఇది. ఈ యాప్ యూఎస్ జీఎస్ నుంచి డేటాను సోర్స్ చేయడంతో కచ్చితమైన సమాచారం వస్తుంది. ఈ యాప్ హోం స్క్రీన్ లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన భూకంపాల జాబితాను అందిస్తుంది. డీఫాల్ట్ గా తేదీ మారుతూ భూకంప తీవ్రత, ఎంత దూరంలో వచ్చిందో చూపుతుంది. అలాగే మనకు డైలీ అలర్ట్ కూడా వస్తాయి.

మై షేక్ : మైషేక్ యాప్ కెనడా విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన యాప్. ఇది యూఎస్ జీఎస్ ద్వారా షేక్ అలర్డ్ ను వినియోగించుకుంటుంది. భూకంపం సంభివించబోతున్నపుడు ఈ యాప్ ద్వారా వాయిస్ అలర్ట్ వస్తుంది. మొబైల్ సైలెంట్ మోడ్ లో ఉన్నా వాయిస్ కమాండ్ రావడం ఈ యాప్ ప్రత్యేకత.

మై ఎర్త్ క్వేక్ అలర్ట్స్ అండ్ ఫీడ్ :  ఈ యాప్ లో కూడా ప్రపంచ వ్యాప్తంగా భూకంపాలను మానిటర్ చేసే అవకాశం ఉంది. ఇందులో మనం సెలెక్ట్ చేసుకున్న ప్రాంతాల భూకంప హెచ్చరికలను కూడా మానిటర్ చేయవచ్చు. గతంలో ఆ ప్రాంతంలో ఎంత స్థాయిలో భూకంపం వచ్చిందో కూడా తెలుసుకోవచ్చు. ఈ యాప్ లో ఉండే ప్రో వెర్షన్ యాపిల్ స్మార్ట్ వాచ్ లకు కూడా ఎలర్ట్ పంపేలా డిజైన్ చేశారు.

ఎర్త్ క్వేక్ ప్లస్ :  ఈ యాప్ చాలా సరళమైన యాప్. యూఎస్ జీఎస్, ఈఎంఎస్సీ, సీఎన్ డీసీ వంటి సంస్థల ద్వారా డేటాను సోర్స్ చేస్తుంది. ఈ యాప్ హోం స్క్రీన్ లో లేబుల్ చేసిన ఫిల్టర్ల ఆధారంగా భూకంప ప్రాంతం, పరిమాణం వంటి విషయాలను తెలుసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా వచ్చే ఎలర్ట్స్ ఐ ఫోన్ వాచ్ ద్వారా కూడా మానిటర్ చేయవచ్చు.

ఎర్త్ క్వేక్స్- లేటెస్ట్ అండ్ అలర్ట్ : ఈ భూకంప ట్రాకింగ్ కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే దీనికి సంబంధించిన కార్యకలాపాల కోసం 22 విభిన్న మూలాధారాలను ఎంచుకోవాలని కోరుతుంది. ఈ యాప్ యూఎస్ జీఎస్, ఈఎంఎస్సీ, బీజీఎస్ వంటి ఫీచర్లు ఉండడంతో వీటిని ఆన్ చేయడంలో అయోమయానికి గురవుతాం. ఈ యాప్ లో కూడా ప్రాంతం, తేదీ ఆధారంగా డేటాను చూసుకోవచ్చు. లోకేషన్ కోసం యాపిల్ మ్యాప్స్ ను ఉపయోగించడంతో కచ్చితమైన సమాచారం వస్తుంది.

లాస్ట్ క్వేక్ : ఈ యాప్ చాలా పాతది. అయినా కచ్చితమైన సమాచారం ఇవ్వడంతో చాలా మంది వినియోగదారులు ఈ యాప్ ను ఇష్టపడుతున్నారు. భూకంప కార్యకలాపాల ప్రతి ప్రవేశం, తేదీ, ప్రాంతం వంటి విషయాలను కచ్చితంగా పేర్కొంటుంది. ఈ యాప్ లో భూకంపంతో పాటు సునామీ హెచ్చరికలను కూడా మానిటర్ చేయవచ్చు. ఆ సమయంలో మనం పొందిన అనుభూతిని ఈ యాప్ నుంచే డైరెక్ట్ గా ట్విట్టర్ లో పోస్టో చేయవచ్చు.

ఎర్ట్ క్వేక్ ప్లస్, అలెర్ట్స్, మ్యాప్స్ అండ్ ఇన్ ఫో :  ఈ యాప్ కూడా ఇతర యాప్ ల మాదిరిగా అన్ని ఫీచర్లను కలిగి ఉంది. కానీ ఈ యాప్ లో ఉన్న ఇండివిడ్యువల్ ఎంట్రీస్ అనే ఆప్షన్ ద్వారా ఎంత మంది ఈ యాప్ ద్వారా సమాచారాన్ని తెలుసుకున్నారో? చూడవచ్చు. 

Post a Comment

0 Comments

Close Menu