Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Sunday, December 18, 2022

ఎక్కువ మైలేజ్ ఇచ్చే టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ బైక్ !


తక్కువ పెట్రోల్ వినియోగంతో ఎక్కువ కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే వాహనాలకు ప్రస్తుతం వాహనప్రియులు ఇష్టపడుతున్నారు.  లీటర్ పెట్రోల్ కు ఎక్కువ మైలేజీని ఇచ్చే అనేక బైక్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఒకటి టీవీఎస్ స్టార్ సిటీ. మీరు ఒకవేళ టీవీఎస్ నుండి విడుదలయ్యే బైక్‌లను ఇష్టపడితే.. ఖచ్చితంగా ఈ బైక్‌ను పరిగణించవచ్చు. కేవలం 7 వేల రూపాయలకే బైక్‌ని ఇంటికి తీసుకెళ్లవచ్చు. స్టార్ సిటీ ప్లస్ బైక్ ఎలక్ట్రిక్ స్టార్ట్ మరియు డిస్క్ బ్రేక్ వేరియంట్లలో లభిస్తుంది. ఈ బైక్ ప్రారంభ ధర రూ.78,140. ఆన్ రోడ్ ధర రూ. 93,857. బైక్‌ను నగదు రూపంలో కొనుగోలు చేస్తే 94 వేల రూపాయలు ఖర్చు చేయాలి. అయితే అంత బడ్జెట్ లేకపోతే కేవలం రూ.7వేలు చెల్లించి బైక్ ను ఇంటికి తీసుకెళ్లవచ్చు.  7 వేల డౌన్ పేమెంట్ చెల్లించి బైక్ కొనుగోలు చేయవచ్చు. ఈ డౌన్ పేమెంట్ పై బ్యాంక్ మీకు రూ. 86,857 రుణం ఇస్తుంది. ఆ తర్వాత నెలకు రూ.2,790 ఈఎంఐ చెల్లించాలి.  ఈ ​​బైక్ 109.7 cc సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 8.19 PS పవర్ మరియు 8.7 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. స్టార్ సిటీ ప్లస్ 83.09 kmpl మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

No comments:

Post a Comment

Popular Posts