Ad Code

బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీపై నూజివీడు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు శిక్షణ


ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీపై శిక్షణలో భాగంగా బెంగళూరుకు చెందిన స్ట్రాహ్యాట్‌ ప్రైవేటు కంపెనీతో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ ఆచార్య జి.వి.ఆర్‌.శ్రీనివాసరావు, స్ట్రాహ్యాట్‌ కంపెనీ సీఈవో చల్లా ఓబుళపతి ఒప్పంద పత్రాలపై డిసెంబర్‌ 9న సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా కంపెనీ బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీకి సంబంధించిన అప్లికేషన్‌లపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వనుంది. ఈ ఒప్పందం మూడేళ్ల పాటు అమలులో ఉంటుంది. ఇంజినీరింగ్‌ తృతీయ సంవత్సరానికి చెందిన విద్యార్థులు దీనికి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్‌ అయిన విద్యార్థులందరికీ మూడు నెలల పాటు బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీపై శిక్షణ అందిస్తారు. అంతేగాక బ్లాక్‌చైన్‌ రంగం లో అవకాశాలపై అవగాహన పెంచేందుకు కంపెనీ శిక్షణ సమయంలో విద్యార్థులకు వర్క్‌షాప్‌లు, హ్యాక్‌థాన్‌లు నిర్వహి­స్తారు. శిక్షణ అనంతరం 25 మంది విద్యా­ర్థులను ఇంటర్న్‌షిప్‌కు ఎంపిక చేస్తారు. ఏడాది పాటు ఉండే ఇంటర్న్‌షిప్‌ కాలంలో నెలకు రూ.25 వేల స్టైఫండ్‌ను అందజేస్తారు. ఆ తర్వాత వారికి పరీక్ష నిర్వహించి అందులో ఉత్తీర్ణులైనవారికి ఏడా­దికి రూ.12 లక్షల ప్యాకేజీతో కంపెనీలో ప్లేస్‌మెంట్‌ ఇవ్వడం జరుగుతుంది. 

Post a Comment

0 Comments

Close Menu