Ad Code

రియల్ మీ జీటీ సిరీస్ లో మరో కొత్త కొత్త ఫోన్ ?


రియల్ మీ జీటీ నియో 5 స్మార్ట్ ఫోన్ తయారీలో ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. ఈ ఫోన్ యొక్క అధికారిక ప్రకటన కంటే ముందే, రాబోయే హ్యాండ్‌సెట్ యొక్క బ్యాటరీ మరియు కెమెరా వివరాలు ఆన్‌లైన్‌లో కనిపించాయి. ఈ కొత్త లీక్ సమాచారం ప్రకారం, Realme GT Neo 5 రెండు వేర్వేరు బ్యాటరీ సామర్థ్యాలతో రెండు వేరియంట్‌లలో వస్తుంది. ఇది 240W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4,600mAh బ్యాటరీ మరియు 150W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ. Realme GT Neo 5 లైనప్ లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)కి మద్దతుతో Sony IMX890 ప్రైమరీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంటుందని తెలుస్తుంది.  చైనీస్ సోషల్ మీడియా సంస్థ అయిన Weiboలో చైనీస్ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ Realme GT Neo 5 విభిన్న బ్యాటరీ మరియు ఛార్జింగ్ స్పెసిఫికేషన్‌లతో రెండు వేరియంట్‌లలో అందించబడుతుందని పేర్కొన్నారు. అతని ప్రకారం, BLP985 అనేది 150W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటారు, అయితే మరొక్క వేరియంట్ అయిన BLP987 240W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4,600mAh బ్యాటరీ ని కలిగి ఉంటుంది. రియల్‌మే GT నియో 5 OIS కి మద్దతుతో Sony IMX890 ప్రైమరీ సెన్సార్‌ను ఉపయోగిస్తుందని టిప్‌స్టర్ సూచించాడు. ఇది Realme GT Neo 3 సిరీస్‌కి అప్‌గ్రేడ్ గా అవుతుంది. Realme GT నియో 5 లాంచ్ గురించి సంస్థ అధికారికంగా ఇంకా ఎలాంటి వివరాలను పంచుకోలేదు. అయినప్పటికీ, వచ్చే ఏడాది ప్రథమార్థంలో అధికారికంగా లాంచ్ చేయవచ్చని చాలా ఊహాగానాలు ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu