Ad Code

గూగుల్ లో తొలగింపులు తప్పవా ?


ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఐటీ కంపెనీలు ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడంపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ చేపట్టాయి. ఇప్పటికే ట్విట్టర్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు ఉద్యోగులకు లే_ ఆఫ్ లు ప్రకటించాయి.. కొద్దిరోజుల క్రితం గూగుల్ కూడా పదివేల మంది ఉద్యోగులపై వేటు వేయనుందనే వార్తలు వచ్చాయి. ఈ తరుణంలో ఆ సంస్థ ఉద్యోగులు సీఈవో సుందర్ పిచాయ్ వద్ద లే_ ఆఫ్ ల గురించి స్పష్టత ఇవ్వాలని ప్రస్తావించారు. ఈ సమయంలో ఆయన భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేనని చెప్పారు. వాస్తవానికి టెక్ కంపెనీలకు ప్రధానాదాయం కొనుగోళ్ళ ద్వారా వస్తుంది. యూరో జోన్ లో అనిశ్చిత పరిస్థితులు, అమెరికన్ మార్కెట్ లో ధరల పెరుగుదల, ఉక్రెయిన్, రష్యా యుద్ధం ఇవన్నీ కూడా మార్కెట్ ను అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో చాలావరకు ప్రకటనల ఆదాయం గూగుల్ కోల్పోవాల్సి వస్తోంది. దీంతో కంపెనీ ఆదాయం పడిపోతున్నది. అయితే ఉద్యోగుల తొలగింపు పై గూగుల్ ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. రాబోయే రోజుల్లో గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ మొత్తం ఉద్యోగుల్లో ఆరు శాతం మందిని తొలగిస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.. అయితే కంపెనీ అంచనాలకు అనుగుణంగా పనిచేయని ఉద్యోగుల జాబితాను సిద్ధం చేయాలని పలు విభాగాల మేనేజర్లను కోరినట్లు సమాచారం. పనితీరు సరిగా లేని ఉద్యోగులను గుర్తించేందుకు గూగుల్ కొత్త మేనేజ్ మెంట్ సిస్టాన్ని కూడా పరిచయం చేసినట్టు తెలుస్తోంది. ఆ నివేదికల ఆధారంగా కొత్త సంవత్సరంలో తొలగింపులు ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం గూగుల్ కు సంబంధించిన వివిధ సంస్థల్లో 1,87,000 మంది పనిచేస్తున్నారు. ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో రిక్రూట్మెంట్ ప్రక్రియ ను నెమ్మదిగా చేయాలని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. దీంతో కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ చేసిన వ్యాఖ్యలు ఉద్యోగుల లే ఆఫ్ వార్తలను నిజం చేస్తున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu