Ad Code

కర్ణాటక రోడ్లపైకి ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు


కర్ణాటక  రాష్ట్రంలోని రోడ్లపై ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెడుతున్నాయి. పర్యావరణ హితం కోరుతూ ..కాలుష్య నివారణతో పాటు ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు కర్నాటక స్టేట్‌ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ కొత్తగా ఒలెక్ట్రా గ్రీన్‌ టెక్ లిమిటెడ్‌ తయారు చేసిన ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను వాడకంలోకి తీసుకొచ్చింది. కర్ణాటక  రాష్ట్ర ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ బి.శ్రీరాములు శనివారం 12మీటర్ల పొడవైన ఏసీ లగ్జరీ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ముందుగా బెంగుళూరు, మైసూరు, షిమోగా, దావణగెరె, చిక్‌మంగుళూరు, విరాజపేటతో పాటు మడికెరె మధ్య ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నడిచే ఈ బస్సులను ఒలెక్ట్రా సంస్థ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేస్తోంది. మేక్ ఇన్‌ ఇండియా చొరవతో ఫేమ్‌-2 పథకం ద్వారా 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను సరఫరా చేస్తుందని మంత్రి శ్రీరాములు తెలిపారు. కేంద్రం భారీ పరిశ్రమలశాఖ సహాకారంతో కర్నాటక ప్రభుత్వం, కేఎస్‌ఆర్టీసీ ఒలెక్ట్రో ఇ- బస్సులను అతి త్వరలోనే రాష్ట్రంలోని అన్నీ డిపోల్లో ఉపయోగించబోతున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం ప్రారంభించిన ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు ఏడు డిపోల నుంచి బయల్దేరుతాయని పేర్కొన్నారు. ఈ ఎయిర్‌ కండీషన్డ్ ఎలక్ట్రిక్ బస్సులు అత్యాధునిక టెక్నాలజీతో పాటు జీరో పర్సంట్ పొల్యూషన్‌ కలిగినట్లు మంత్రి తెలిపారు. కర్నాటకలో ప్రయాణికులు త్వరలో శబ్ధ, వాయు కాలుష్యం లేని ఏసీ ఎలక్ట్రిక్ లగ్జరీ బస్సుల్లో ప్రయాణిస్తారని చెప్పారు. అంతే కాదు ప్రజా రవాణా సంస్థలో ఒలెక్ట్రో సంస్థ ఒప్పందం మరింత బలపడుతుందన్నారు. డ్రైవర్ సీటుతో పాటు 43 సీటింగ్ కెపాసిటీ కలిగిన ఒలెక్ట్రా ఇ బస్ ప్రయాణికులకు పూర్తి సౌకర్యవంతంగా, సుఖమైన ప్రయాణ అనుభూతిని కలిగిస్తుంది. అంతే కాదు ప్రతి ఇ-బస్సులో సీసీ కెమెరాల మానిటరింగ్‌తో పాటు ఎమర్జెన్సీ బటన్, ఫైరింజన్ ఎక్వీప్‌మెంట్, ఫస్ట్ ఎయిడ్‌ కిట్‌తో కూడిన మెడికల్ సర్వీస్‌ అందుబాటులో ఉంటాయి. అలాగే ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులు సేఫ్‌గా బయటపడేందుకు తగిన వస్తు సామాగ్రిని బస్సులో ఏర్పాటు చేయడమైంది. రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ బస్సులు బ్రేకింగ్ సమయంలో కోల్పోయిన గతిశక్తిలో కొంత భాగాన్ని తిరిగి పొందేందుకు అనుమతిస్తుంది. అధిక-పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టమ్ 2-3 గంటల మధ్య బ్యాటరీని పూర్తిగా రీఛార్జ్ చేయడానికి అనుమతిస్తుంది, ట్రాఫిక్ ప్రయాణీకుల లోడ్ పరిస్థితుల ఆధారంగా ఇ-బస్సులు ఒకసారి ఛార్జింగ్ చేస్తే 300 కి.మీ వరకు ప్రయాణించేలా ఈ ఎలక్ట్రిక్ బస్సులు పని చేస్తాయి. ఇ-బస్సులలో సౌకర్యవంతమైన లగ్జరీ పుష్-బ్యాక్ సీట్లు ఉన్నాయి. అదనంగా, తాజా టీవీ & ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్రతి సీటుకు అంతర్నిర్మిత USB ఛార్జర్‌లు మరియు విశాలమైన లగేజీ స్థలం సంతోషకరమైన ప్రయాణాన్ని నిర్ధారిస్తాయి. ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు మన దేశంలోని రోడ్లపై 8.5 కోట్ల కి.మీ పూర్తి చేశాయి. ఇప్పటి వరకు దాదాపు 75,000 టన్నుల CO2 ఉద్గారాలను తగ్గించాయి. ఈ బస్సుల వాడకం ద్వారా ఇంధన ఖర్చు దాదాపు రూ. 300 కోట్లు ఆదా చేయడమైంది. ఏపీ , గుజరాత్‌ వంటి రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలను కలుపుకొని వెయ్యి బస్సులను పంపిణి చేయడం జరిగింది. ఒలెక్ట్రా బస్సు కొండ భూభాగం, మనాలి నుండి రోహ్‌తంగ్ పాస్‌లో ప్రయాణించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చేరిన రికార్డును కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ బస్సుల తయారి సంస్థ ఒలెక్ట్రా 2000సంవత్సరంలో స్థాపించబడింది. ఇప్పుడు దేశంలోనే అగ్రగామిగా మారింది.

Post a Comment

0 Comments

Close Menu