Ad Code

వాట్సప్‌లో మెటా అవతార్‌ !


వాట్సాప్‌ మెటా అవతార్ ఫీచర్‌ను ఇంట్రడ్యూస్‌ చేసింది. ఇప్పుడు వినియోగదారులు అవతార్‌ ఫీచర్‌ను ఉపయోగించవచ్చని మెటా కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ అవతార్‌లను వాట్సప్‌లో ప్రొఫైల్ పిక్చర్స్‌గా సెట్‌ చేసుకోవచ్చు. లేదా 36 కస్టమ్‌ స్టిక్కర్‌లుగా ఉపయోగించవచ్చు. ఇంతకుముందు ప్రొఫైల్‌ పిక్చర్‌లను యూజర్‌ మాన్యువల్‌గా అప్‌లోడ్‌ చేయాల్సి వచ్చేది. ఏదీ అప్‌లోడ్‌ చేయకపోతే బ్లాంక్‌గా ఉండేది. అయితే ఇప్పుడు వాట్సాప్‌ ప్రొఫైల్‌ పిక్చర్స్‌గా సెట్‌ చేసుకొనే అవతార్‌లను లాంచ్‌ చేసింది. WABetaInfo ప్రకారం.. మెటా అవతార్ ఫీచర్ గత కొంతకాలంగా ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ డివైజ్‌లలో బీటా టెస్టర్‌లకు అందుబాటులో ఉందని తెలిపింది. అయితే ప్రస్తుతానికి ఈ ఫీచర్ కొంతమంది వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉందని తెలిపింది. అయితే త్వరలో వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. స్నాప్‌చాట్‌(Snapchat)లో కస్టమైజ్డ్‌ క్యారెక్టర్స్‌ లాగ, మెటా అవతార్‌లను వర్చువల్‌గా BitmojiSగా క్రియేట్‌ చేయవచ్చు. అయితే మెటా ఈ ఫీచర్‌ని మరింత అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతుంది. ఈ అవతార్‌లు ఏదో ఒక రోజు మెటావర్స్‌లో సంబంధిత వినియోగదారులను సూచించే అవకాశం ఉంది. WABetaInfo ప్రకారం.. వాట్సాప్‌లో యూజర్లు తమతో తాము కమ్యూనికేట్‌ కావడానికి అవతార్ ఉత్తమ మార్గం. ఈ ఫీచర్ ఇటీవలే కొంతమందికి అందుబాటులోకి వచ్చినందున వినియోగదారులు కొన్ని చిన్న అవాంతరాలను ఎదుర్కోవచ్చు. ప్లే స్టోర్ నుంచి ఆండ్రాయిడ్‌ డివైజ్‌ల కోసం వాట్సాప్‌ బీటాను అప్‌డేట్ చేసిన తర్వాత కొంతమంది బీటా టెస్టర్‌లు అవతార్‌ను క్రియేట్‌ చేసే ఆప్షన్‌ పొందారు. అవతార్‌ను క్రియేట్‌ చేసిన తర్వాత, మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వెంటనే కొత్త స్టిక్కర్ ప్యాక్‌ను క్రియేట్‌ చేస్తుంది. తద్వారా వినియోగదారులు తమ ప్రియమైన వారితో స్టిక్కర్‌లను షేర్‌ చేసుకోవచ్చు. అదనంగా, వినియోగదారులు తమ ప్రొఫైల్ పిక్చర్‌గా ఉపయోగించడానికి అవతార్‌ను సెలక్ట్‌ చేసుకోవచ్చు. కొన్ని వారాల్లో మరింత మంది వినియోగదారులు ఈ ఫీచర్‌ను పొందే అవకాశం ఉందని WABetaInfo నివేదిక పేర్కొంది.

Post a Comment

0 Comments

Close Menu