Ad Code

100జీబీ స్టోరేజీతో మైక్రోసాఫ్ట్ 365 బేసిక్ ప్లాన్ !


జనవరి 30న మైక్రోసాఫ్ట్ "మైక్రోసాఫ్ట్ 365 బేసిక్" అనే కొత్త సబ్‌స్క్రిప్షన్ సర్వీస్‌ను లాంచ్ చేస్తున్నామని ప్రకటించింది. ఈ అప్‌కమింగ్ సర్వీస్ ధర నెలకు $1.99 కాగా ఇది 100GB క్లౌడ్ స్టోరేజ్‌ను ఆఫర్ చేస్తుంది. ఇది ఉచిత ఆప్షన్‌లో అందుబాటులో లేని అదనపు ఫీచర్లను యూజర్లకు ఆఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ నెలకు 6.99 డాలర్ల విలువైన పర్సనల్ సబ్‌స్క్రిప్షన్ కంటే తక్కువ ధరతో వస్తుంది. అలానే యాడ్-ఫ్రీ ఔట్లుక్ వెబ్ & మొబైల్ ఎక్స్‌పీరియన్స్ ఆఫర్ చేస్తుంది. మైక్రోసాఫ్ట్ 365 బేసిక్ సర్వీస్ మెరుగైన సెక్యూరిటీ ఫీచర్లతో కూడా వస్తుందని అమెరికన్ టెక్నాలజీ న్యూస్ వెబ్‌సైట్ ది వెర్జ్ నివేదించింది. ఈ Microsoft 365 బేసిక్ సబ్‌స్క్రిప్షన్‌లో Outlook ఈమెయిల్ అకౌంట్ కోసం డేటాను ఎన్‌క్రిప్ట్ చేయడం, అనుమానాస్పద లింక్‌ల కోసం చెక్ చేయడం, అటాచ్‌మెంట్లపై వైరస్‌లు, మాల్వేర్ కోసం స్కాన్ చేయడం వంటి ఎక్స్‌ట్రా సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయి. యూజర్లు ఇప్పటికే OneDriveలో 100GB స్టోరేజ్ కలిగి ఉంటే వారు అదే నెలవారీ ఫీజు 1.99 డాలర్లతో ఆటోమేటిక్‌గా Microsoft 365 Basicకి అప్‌గ్రేడ్ అవుతారు. "సంవత్సరం తరువాత, మైక్రోసాఫ్ట్ OneDrive కోసం మరిన్ని అడ్వాన్స్‌డ్‌ సెక్యూరిటీ ఫీచర్లను ఆఫర్ చేస్తుంది. వీటిలో పర్సనల్ వాల్ట్ అనే ఫీచర్‌ ఉంటుంది. ఇందులో యూజర్లు సున్నితమైన ఫైల్‌లను స్టోర్ చేయవచ్చు. అలానే పాస్‌వర్డ్ ప్రొటెక్టెడ్ లింక్స్, ఎక్స్‌పైరింగ్ లింక్స్‌, ransomware డిటెక్షన్, రికవరీ, బల్క్ ఫైల్ రిస్టోర్ సహా మరిన్ని అడ్వాన్స్‌డ్‌ సెక్యూరిటీ ఫీచర్లను జోడించాలని యోచిస్తోంద"ని మైక్రోసాఫ్ట్ 365 ప్రొడక్ట్ మార్కెటింగ్ డైరెక్టర్ గారెత్ ఓస్ట్రిక్ పేర్కొన్నారు. Microsoft 365 Basic సర్వీస్ క్లౌడ్ స్టోరేజ్‌తో పాటు మైక్రోసాఫ్ట్ నుంచి టెక్నికల్ సపోర్ట్‌కి యాక్సెస్‌ను ఇస్తుంది. ఇందులో Microsoft 365 యాప్‌లు, విండోస్ 11 రెండింటికీ ఫోన్, ఆన్‌లైన్ చాట్ మద్దతు ఉంటుంది. 6.99 డాలర్ల పర్సనల్ సబ్‌స్క్రిప్షన్, కొత్త 1.99 డాలర్ల బేసిక్ సబ్‌స్క్రిప్షన్ మధ్య ప్రధాన వ్యత్యాసం బేసిక్ సబ్‌స్క్రిప్షన్ అనేది Word, Excel, PowerPoint డెస్క్‌టాప్ వెర్షన్‌లకు యాక్సెస్‌ని కలిగి ఉండదు. బదులుగా, బేసిక్ సబ్‌స్క్రైబర్లు ఈ యాప్‌ల వెబ్ లేదా మొబైల్ వెర్షన్లను ఉపయోగించాల్సి ఉంటుంది. మైక్రోసాఫ్ట్ తన ఆఫీస్ యాప్ పేరును మొబైల్ డివైజ్, విండోస్ కంప్యూటర్లలో మైక్రోసాఫ్ట్ 365గా మారుస్తోంది. 

Post a Comment

0 Comments

Close Menu